అహే ఆపు..లొడ లొడా వాగేస్తున్నావ్..వేదికపై యాంకర్ సుమ బిత్తరపోయేలా చేసిన బాలయ్య  

Published : Jun 29, 2023, 09:41 PM IST
అహే ఆపు..లొడ లొడా వాగేస్తున్నావ్..వేదికపై యాంకర్ సుమ బిత్తరపోయేలా చేసిన బాలయ్య  

సారాంశం

ఫ్యామిలీ హీరోగా తెలుగు ప్రేక్షకుల్లో ఎంతో అభిమానం సొంతం చేసుకున్న జగపతిబాబు సెకండ్ ఇన్నింగ్స్ లో ఊహించని టర్న్ తీసుకున్నారు. డెడ్లీ విలన్ గా.. విలక్షణ నటుడిగా మారిపోయారు.

ఫ్యామిలీ హీరోగా తెలుగు ప్రేక్షకుల్లో ఎంతో అభిమానం సొంతం చేసుకున్న జగపతిబాబు సెకండ్ ఇన్నింగ్స్ లో ఊహించని టర్న్ తీసుకున్నారు. డెడ్లీ విలన్ గా.. విలక్షణ నటుడిగా మారిపోయారు. లెజెండ్ చిత్రంతో విలన్ గా మారిన బాలయ్య ఆ తర్వాత నాన్నకు ప్రేమతో, రంగస్థలం , గూఢచారి లాంటి చిత్రాల్లో తన విలనిజంతో అందరికి షాకిచ్చారు. 

జగపతి బాబు ప్రధాన పాత్రల్లో తాజాగా నటిస్తున్న చిత్రం రుద్రంగి. అజయ్ సామ్రాట్ దర్శకత్వంలో తెలంగాణ నేపథ్యంలో ఈ చిత్రం పీరియాడిక్ డ్రామాగా తెరకెక్కింది.జూలై 7న ఈ చిత్రం గ్రాండ్ రిలీజ్ కి రెడీ అవుతోంది. దీనితో నేడు హైదరాబాద్ లో ప్రీ రిలీజ్ వేడుక నిర్వహించారు. ఈ చిత్రానికి తెలంగాణ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ నిర్మాత. 

ఇదిలా ఉండగా ప్రీ రిలీజ్ వేడుకకి నటసింహం నందమూరి బాలకృష్ణ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. రుద్రంగి ప్రీరిలీజ్ వేడుకలో ఆసక్తికర సంఘటన జరిగింది. యాంకర్ సుమ అతిథుల్ని వేదికపైకి ఆహ్వానిస్తూ ఒక్కొక్కరి గురించి చకచకా చెబుతూ ఉంది. ఇంతలో జగపతి బాబు ప్రసంగించడానికి రెడీ అయ్యారు. కానీ సుమ జగపతి బాబుకి మైక్ ఇవ్వకుండా ఆయన్ని పొగిడే కార్యక్రమం పెట్టుకుంది. దీనితో పక్కనే ఉన్న బాలయ్య.. సుమ బిత్తరపోయేలా చేశారు. అహే ఆపు.. లొడలొడా వాగేస్తున్నాం అంటూ సరదాగా కసిరారు. దీనితో సుమ ఒక్కసారిగా ఉలిక్కి పడింది. 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Vahini Battles Cancer : విషమంగా సీనియర్ నటి ఆరోగ్య పరిస్థితి, సహాయం కోసం ఎదురుచూపులు
Remuneration: సౌత్‌లో అత్యధిక పారితోషికం తీసుకున్న ఒకే ఒక్కడు.. ఆయన ముందు ప్రభాస్, విజయ్‌, అల్లు అర్జున్‌ జుజూబీ