భార్య వెనుక దాక్కున్న మహేష్.. ఫోటో వైరల్!

Published : May 09, 2019, 11:20 AM IST
భార్య వెనుక దాక్కున్న మహేష్.. ఫోటో వైరల్!

సారాంశం

మహేష్ బాబు నటించిన 'మహర్షి' సినిమా గురువారం నాడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

మహేష్ బాబు నటించిన 'మహర్షి' సినిమా గురువారం నాడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సందర్భంగా తన భర్తకి విషెస్ చెబుతూ నమ్రత సోషల్ మీడియాలో ఓ పోస్ట్ పెట్టింది.

''ఈరోజు బిగ్ డే.. మహర్షి సినిమా ద్వారా ప్రేక్షకులకు అధ్బుతమైన చిత్రాన్ని కానుకగా ఇవ్వడానికి నువ్వెంత కష్టపడ్డావో నేను చూశాను. ఇప్పుడు ఆ కష్టాన్ని ప్రపంచం చూడబోతుంది. గుడ్ లక్ మై లవ్ మహేష్.. రిషి పాత్రను నేనెంతగా ఇష్టపడ్డానో.. అదే విధంగా అందరూ ఇష్టపడతారని ఆశిస్తున్నాను'' అంటూ రాసుకొచ్చింది. 

అయితే ఈ ఫోటో చూసిన నెటిజన్లు రకరకాల కామెంట్స్ పెడుతున్నారు. నమ్రత వెనుక దాక్కొని మహేష్ ఆమెని కౌగిలించుకోవడం నెటిజన్ల దృష్టిని ఆకర్షిస్తోంది. మహేష్ చిన్నపిల్లాడిలా భార్య వెనుక దాక్కున్నారు అంటూ కామెంట్స్ పెడుతున్నారు.

మొదటి నుండి 'మహర్షి' సినిమా మీద ప్రత్యేక శ్రద్ధ తీసుకొని సెలబ్రిటీల అభిప్రాయాలను ఒక్కొక్కటిగా షేర్ చేస్తూ ప్రమోషన్స్ లో తన వంతు పాత్ర పోషించింది. 

 

PREV
click me!

Recommended Stories

Bigg Boss Telugu 9 : తనూజ తో ఐటమ్ సాంగ్ చేయిస్తానన్న ఇమ్మాన్యుయేల్, అడ్డంగా బుక్కైన డీమాన్ పవన్.. హౌస్ లో చివరి రోజు సందడి
Emmanuel Remuneration: ఇమ్మూ రెమ్యూనరేషన్‌ మైండ్‌ బ్లోయింగ్‌.. బిగ్‌ బాస్‌ తెలుగు 9 షోకి ఎంత తీసుకున్నాడంటే?