Israel War: మా అక్క బావను పిల్లల ముందే చంపేశారు... నాగిని ఫేమ్ మధుర నాయక్ సంచలన వీడియో 

Published : Oct 11, 2023, 09:38 AM ISTUpdated : Oct 11, 2023, 09:45 AM IST
Israel War: మా అక్క బావను పిల్లల ముందే చంపేశారు... నాగిని ఫేమ్ మధుర నాయక్ సంచలన వీడియో 

సారాంశం

ఇజ్రాయెల్ యుద్ధంలో హమాస్ టెర్రరిస్ట్స్ తన అక్క బావను కాల్చి చంపినట్లు నటి మధుర నాయక్ సోషల్ మీడియా వేదికగా వీడియో విడుదల చేశారు.   

ఇజ్రాయిల్ దేశంలో భయానక పరిస్థితులు నెలకొన్నాయి. హమాస్ తీవ్ర వాదులకు ఇజ్రాయెల్ దేశానికి మధ్య భీకర యుద్ధం నడుస్తోంది. అమాయక జనాలు హమాస్ ఉగ్రవాదుల చేతుల్లో హతం అవుతున్నారు. దారుణ వీడియోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. యూదులు అయిన కారణంగా తన అక్క, బావను కాల్చి చంపినట్లు నాగిని సీరియల్ ఫేమ్ మధుర నాయక్ వీడియో విడుదల చేశారు. తన కుటుంబం ఒక కొడుకు, కూతురిని కోల్పోయినట్లు ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.

మధుర నాయక్ ఇంస్టాగ్రామ్ వీడియోలో... ''నేను భారతీయ మూలాలకు చెందిన యూదును. ఇండియాలో యూదులు కేవలం 3000 మంది ఉంటారు. అక్టోబర్ 7న మా కుటుంబం ఒక కూతురు, కొడుకును కోల్పోయింది. నా కజిన్ ఒడయా, ఆమె భర్తను పిల్లల ముందే కాల్చి చంపారు. మా కుటుంబం పడే బాధ, ఆవేదన వర్ణనాతీతం. ప్రస్తుతం ఇజ్రాయెల్ అత్యంత క్లిష్ట పరిస్థితుల్లో ఉంది. హమాస్ ఉగ్రవాదుల కారణం పిల్లలు, మహిళలు ప్రాణాలు కోల్పోతున్నారు. వీధులు మంటల్లో ఆహుతి అవుతున్నాయి. మహిళలు, వృద్దులు, పిల్లలు, బలహీన వర్గాలను వారు టార్గెట్ చేస్తున్నారు...'' అని ఆవేదన వెళ్లగక్కారు. 

మధుర నాయక్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఆమె కుటుంబానికి అభిమానులు సంతాపం ప్రకటిస్తున్నారు. హిందీ పాప్యులర్ సీరియల్ నాగినిలో మధుర నాయక్ కీలక రోల్ చేశారు. ఆ విధంగా ఆమె పాప్యులర్ అయ్యారు. 
 

PREV
click me!

Recommended Stories

Akhanda 2 Premiers: అఖండ 2 ప్రీమియర్ షోలు రద్దు, తీవ్ర ఇబ్బందుల్లో నిర్మాతలు.. సినిమా రిలీజ్ పరిస్థితి ఏంటి ?
Akhanda 2: అఖండ 2లో ప్రగ్యా జైస్వాల్ ఎందుకు లేదో తెలుసా ? స్టోరీ చెబుతూ ట్విస్ట్ రివీల్ చేసిన బాలయ్య