నాగార్జున ఆందోళన అంతా ఒక్కటే.. 'అఖిల్'!

Published : Jan 31, 2019, 04:56 PM IST
నాగార్జున ఆందోళన అంతా ఒక్కటే.. 'అఖిల్'!

సారాంశం

'మిస్టర్ మజ్ను' రిజల్ట్ తో ఒక్కసారిగా షాక్ అయ్యాడు నాగార్జున. హిట్ అవుతుందనుకున్న సినిమాకి ఫ్లాప్ టాక్ రావడం నాగార్జున ఊహించలేదు. ఈ సినిమాపై ఎంతో నమ్మకం పెట్టుకున్నాడు నాగార్జున. 

'మిస్టర్ మజ్ను' రిజల్ట్ తో ఒక్కసారిగా షాక్ అయ్యాడు నాగార్జున. హిట్ అవుతుందనుకున్న సినిమాకి ఫ్లాప్ టాక్ రావడం నాగార్జున ఊహించలేదు. ఈ సినిమాపై ఎంతో నమ్మకం పెట్టుకున్నాడు నాగార్జున. తన కుమారుడు అఖిల్ కి కచ్చితంగా హిట్ వస్తుందని కొడుకుతో కలిసి కొన్ని టీవీ ఛానళ్లకు ఇంటర్వ్యూలు కూడా ఇచ్చాడు.

ఓ ఇంటర్వ్యూలో నాగార్జున.. ఈ వారంలో గోవా వెళ్తున్నట్లు రెండు, మూడు వారాలు అక్కడే రిలాక్స్ అవ్వాలనుకుంటున్నట్లు చెప్పాడు. 'మిస్టర్ మజ్ను' సినిమా సక్సెస్ సెలబ్రేషన్స్ అక్కడ జరుపుకుంటామని నమ్మకంగా చెప్పాడు. అఖిల్ కూడా సినిమాపై చాలా ఆశలే పెట్టుకున్నాడు.

అన్ని అంశాలు కలగలిపిన ఈ సినిమా అందరికీ నచ్చుతుందని చెప్పాడు. కానీ సినిమా రిజల్ట్  ఊహించినట్లుగా రాలేదు. మూడు వరుస ఫ్లాప్ లతో అఖిల్ క్రేజ్ బాగా దెబ్బ తింది. కనీసం ఎవరేజ్ గ్రాసర్ సినిమా అయినా పడకపోతే హీరోగా అఖిల్ నిలబడడం చాలా కష్టం. ఈ విషయం నాగార్జున ఆందోళనకి గురి చేస్తోంది

కొడుకు కెరీర్ ని ఎలాగైనా నిలబెట్టాలని తన వంతు ప్రయత్నాలు మొదలుపెట్టాడు. ఈ క్రమంలో గోవాలో తన హాలిడే ట్రిప్ కూడా క్యాన్సిల్ చేసుకున్నాడు. మరి నాగార్జున కోరుకుంటున్నట్లుగా అఖిల్ హీరోగా ఎప్పుడు సక్సెస్ అందుకుంటాడో చూడాలి!

PREV
click me!

Recommended Stories

నయనతారకి టాలీవుడ్ డైరెక్టర్ నుంచి మరో కళ్ళు చెదిరే ఆఫర్.. పాన్ ఇండియా బ్లాక్ బస్టర్ లోడింగ్ ?
దానికోసం నా బాడీ మొత్తం మేకప్ వేశారు, తన కెరీర్ లో చీకటి కోణాన్ని బయట పెట్టిన ఎన్టీఆర్ హీరోయిన్