
ఫ్యామిలీ బ్యాక్ గ్రౌండ్ ఎంత ఉన్నా కూడా క్రేజ్ అనేది మొదటి సినిమా వరకే ఉంటుందని అఖిల్ ని ఒక ఉదాహరణగా చూపించవచ్చు. అఖిల్ మొదటి సినిమా అనంతరం మాస్ సినిమాలు చేయనివ్వకుండా హలో లాంటి ఒక సింపుల్ రొమాంటిక్ లవ్ స్టోరీని చేయించిన నాగ్ అప్పుడు కూడా ఫెయిల్ అయ్యాడు. అసలైతే మొదట ఆ కథను నాగ్ కూడా ఒప్పుకోలేదట.
అఖిల్ సైడ్ నుంచి అలాగే తల్లి అమల నిర్ణయమే హలో పట్టాలెక్కడానికి కారణమని అప్పట్లో రూమర్ వచ్చింది. ఇక మూడవ సినిమా అఖిల్ ఇష్టమని హలో సినిమా ప్రమోషన్స్ లోనే నాగ్ చెప్పాడు. అయినా కూడా హిట్టిచ్చే వరకు వదలద్దని నాగార్జున అనుకున్నాడు. కొంత మంది దర్శకులతో మాట్లాడినప్పటికీ వర్కౌట్ కాలేదు. సడన్ గా అఖిల్ కి సన్నిహితుడైన వెంకీ అట్లూరి తొలిప్రేమతో హిట్టందుకోగానే మూడవ సినిమా మిస్టర్ మజ్ను చక చక తెరకెక్కేసింది.
నిజానికి ఇది అఖిల్ సొంత నిర్ణయమే అని తెలుస్తోంది. చాలా వరకు నాగ్ కి ఆ దర్శకుడితో పని చేయడం ఇష్టం లేదని ఫిల్మ్ నగర్ లో టాక్ వినిపిస్తోంది. నాగ్ తాపత్రయం ఒక్కటే.. అఖిల్ ఎలాగైనా మాస్ ఆడియెన్స్ కి దగ్గరవ్వాలని ఆశపడుతున్నారు. అది దృష్టిలో ఉంచుకొనే ప్రీ రిలీజ్ లో జూనియర్ ఎన్టీఆర్ ను చూపించి ముందు అలా మాస్ అలవాటు చేసుకోరా.. అని నవ్వుతూనే మాస్ కథలను ఎంచుకోమని ఇన్ డైరెక్ట్ గా చెప్పాడు.
దీంతో నాగ్ ఇంటెన్షన్ ఏమిటో అర్ధమవుతోంది. గతంలో అఖిల్ రెండు సినిమాలకు ప్రమోషన్స్ విషయంలో కేర్ తీసుకున్న నాగ్ మిస్టర్ మజ్ను సినిమా విషయంలో మాత్రం పెద్దగా కలుగజేసుకోవడం లేదు. కొడుకు నిర్ణయానికి విసిగిపోయి సైలెంట్ అయినట్లు టాక్. ఈ విషయం కూడా ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. మరి నాగ్ ఇచ్చిన ఫ్రీడమ్ తో అఖిల్ ఎంతవరకు సక్సెస్ కొడతాడో చూడాలి.