వివాదం ముదురుతుండడంతో నాగార్జున తీవ్ర అసహనానికి గురైనట్లు తెలుస్తోంది. ఈ మేరకు బాలీవుడ్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. మాములుగా నాగ్ వివాదాలకు దూరంగా ఉంటారు. కానీ తన ఫ్యామిలీని టార్గెట్ చేస్తే మాత్రం ఆయన ఒప్పుకోరు. వెంటనే రెస్పాండ్ అవుతారని అంటున్నారు.
నాన్ ఎల్లారయుమ్ కొల్లువెన్’ (నేను అందర్నీ చంపేస్తా) - ‘ద ఫ్యామిలీ మ్యాన్ 2’ ట్రైలర్‌లో సమంత చెప్పిన ఓ డైలాగ్..ఈ డైలాగు.. సిరీస్‌పై తమిళుల ఆగ్రహ జ్వాలలకు ముఖ్య కారణమైంది. ఈ సిరీస్ ట్రైలర్ రీసెంట్‌గా యూట్యూబ్లో రిలీజ్ అయి కాంట్రవర్సీ అయింది. ఈ ట్రైలర్‌లో కొన్ని సీన్లు తమిళుల మనోభావాలను కించపరిచేవిగా ఉన్నాయని సోషల్ మీడియాలో తమిళులు విరుచుకుపడ్డారు. ఈ సిరీస్‌కి వ్యతిరేఖంగా “ఫ్యామిలీ మ్యాన్-2 ఎగైనెస్ట్ తమిళ్” అనే హాష్ ట్యాగ్‌ను కూడా వైరల్ చేశారు.
తమిళుల కోసం పోరాడిన లిబరేషన్ టైగర్స్ ఆఫ్ తమిళ్ ఈలంకి ఐఎస్ఐ ఉగ్రవాద సంస్థతో లింకులు ఉన్నట్లు ట్రైలర్ లో చూపించడం దారుణం అని సోషల్ మీడియాలో కమెంట్ల వర్షం కురిపిచారు. ఈ సిరీస్ పై తమిళ్ ప్రజలు కోపంగా ఉన్నారు. అయితే తమిళ తంబీలు కాస్త “ప్రశాంతంగా ఉండండి.”.. అంటూ ట్విట్టరల్లో ట్వీట్ చేశారు సమంత. ఫ్యామిలీ మ్యాన్ సెకండ్ సిరీస్‌లో.. తన క్యారెక్టర్ పై వస్తున్న ట్రోల్స్‌కు ఆమె ఈ విధంగా స్పందించారు. కానీ ఫలితం లేకుండా పోయింది.
సమంతని పాయింట్ అవుట్ చేసేలా వివాదం ముదురుతుండడంతో నాగార్జున తీవ్ర అసహనానికి గురైనట్లు తెలుస్తోంది. ఈ మేరకు బాలీవుడ్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. మాములుగా నాగ్ వివాదాలకు దూరంగా ఉంటారు. కానీ తన ఫ్యామిలీని టార్గెట్ చేస్తే మాత్రం ఆయన ఒప్పుకోరు. వెంటనే రెస్పాండ్ అవుతారని అంటున్నారు. సమంత ఈ వెబ్ సిరీస్ లో తన వంతుగా నటించింది. అంతకు మించి ఆమెకు ఈ వివాదంతో ఎలాంటి సంబంధం లేదు. అయినప్పటికీ సామ్ ని టార్గెట్ చేయడంపై నాగ్ సీరియస్ అయ్యి...అదే విషయం మీడియా ద్వారా ఆయన చెప్దామా అనుకుంటున్నారట. అయితే అది వివాదాన్ని ఇంకా రాజేసినట్లు అవుతుందని ఆపారట.
వివాదానికి కేంద్ర బిందువైన అంశంపై క్రియేటివ్ ద్వయం రాజ్-డీకే స్పందించారు. ‘‘తమిళ ప్రజలపైన మాకు అపూర్వమైన ప్రేమ, అంతకు మించిన గౌరవం ఉన్నాయి. తమిళ సంస్కృతి, ప్రజల మనోభావాల పట్ల మాకు అవగాహన ఉంది. రచన, నట బృందంలో అధిక శాతం తమిళులు ఉన్నారు. ట్రైలర్‌లో కొన్ని షాట్లు చూసి తప్పుగా అర్థం చేసుకుంటున్నారు. షో విడుదలయ్యే వరకూ ఎదురు చూడండి’’ అని రాజ్-డీకే పేర్కొన్నారు.
అయితే ఈ విషయమై అమేజాన్ ప్రైమ్ మాత్రం వెనక్కి తగ్గేటట్లు కనపడటం లేదు. జూన్ 4 న బొమ్మ పడిపోవాల్సిందే అంటోంది. ఇక మనోజ్‌బాజ్‌పాయ్ ప్రధాన పాత్రలో రెండేళ్ల క్రితం ఓటీటీ వేదికగా అమెజాన్ ప్రైమ్‌లో ప్రసారమైన హిందీ వెబ్ సీరీస్ చిత్రం ‘ది ఫ్యామిలీ మ్యాన్’. ఈ సినిమాకి సీరీస్‌కు కొనసాగింపుగా ‘ది ఫ్యామిలీ మ్యాన్- 2’ తెరకెక్కింది. ప్రముఖ నటి సమంత నటిస్తున్నఈ వెబ్‌సీరీస్ ఈ ఏడాది ఫిబ్రవరి 12న విడుదల కానుందని ప్రకటించారు. అయితే అనుకోని కారణాల వల్ల మరికొంత ఆలస్యమైంది.తాజాగా ఈ సీరిస్ ట్రైలర్‌ని మే 19న విడుదల చేస్తే మంచి రెస్పాన్స్ వచ్చింది.
రాజ్ నిడిమోరు, కృష్ణ డీకే దర్శకనిర్మాణంలో తెరకెక్కిన ఈ చిత్రంలో ప్రియమణి, షరీబ్ హష్మి, శరద్ కేల్కర్, శ్రేయా ధన్వంతరి తదితరులు ఇతర పాత్రల్లో నటించారు. సమంత ప్రస్తుతం తెలుగులో ‘శాకుంతలం’లో ప్రధాన పాత్రలో నటిస్తుంది. గుణశేఖర్ దర్శకత్వం వహిస్తున్నారు. తమిళంలో విఘ్నేశ్ శివన్ దర్శకత్వం వహిస్తున్న కాథువాకుల రెండు కాదల్’చిత్రంలో విజయ్‌సేతుపతి, నయనతారలతో కలిసి నటిస్తోంది.