మందులో సోడా కలపను.. నాగార్జున వ్యాఖ్యలు!

By Udayavani DhuliFirst Published Sep 25, 2018, 1:39 PM IST
Highlights

'దేవదాస్' సినిమాలో నాగార్జున-నాని మందు తాగే సన్నివేశాలు సినిమాకు చాలా కీలకం. అందుకే మొదటి టీజర్ కూడా దాన్నే ఆధారంగా చేసుకొని కట్ చేశారు. అయితే తాను మందులో సోడా కలపనని నేరుగా 'రా' తాగేస్తానని హీరో నాగార్జున కొన్ని వ్యాఖ్యలు చేశారు. 

'దేవదాస్' సినిమా రిలీజ్ కు సిద్ధమవుతుండంతో చిత్రబృందం ప్రమోషన్స్ ముమ్మరం చేసింది. ఇందులో భాగంగా ప్రెస్ మీట్ కి హాజరయ్యారు. ''నీకు 'రా' తాగడం నేను నేర్పించానా..? నీకే తెలుసా..?'' అంటూ నానిని ప్రశ్నించాడు నాగార్జున.

దీనికి బదులిస్తూ.. 'నేను 'రా' తాగను సర్' అన్నాడు. తరువాత నాగ్ నవ్వుతూ.. 'నేను మాత్రం రానే తాగుతా' అనేశాడు. అదేంటని విలేకరులు ప్రశ్నించగా.. ''వాళ్లు అంత కష్టపడి తయారు చేస్తే దాంట్లో.. సోడానో.. నీళ్లో కలిపి పాడు చేస్తే ఎలా..?'' అంటూ నాగ్ గట్టిగా నవ్వేశాడు. 

click me!