గంగవ్వకి ఏడు లక్షల చెక్‌ అందించిన నాగ్‌..అమ్మ రాజశేఖర్‌ సాయం..ఉర్రూతలూగించిన `బీబీఉత్సవం`

Published : Feb 07, 2021, 08:34 PM ISTUpdated : Feb 07, 2021, 08:35 PM IST
గంగవ్వకి ఏడు లక్షల చెక్‌ అందించిన నాగ్‌..అమ్మ రాజశేఖర్‌ సాయం..ఉర్రూతలూగించిన `బీబీఉత్సవం`

సారాంశం

బిగ్‌బాస్‌ హోస్ట్ నాగార్జున కూడా గంగవ్వకి పర్సనల్‌గా డబ్బులిస్తున్నట్టు తెలిసింది. అంతేకాదు తాజాగా ఈ ఆదివారం `బిగ్‌బాస్‌4` రీ యూనియన్‌ పార్టీ `బిగ్‌బాస్‌4 ఉత్సవం` పేరుతో నిర్వహించారు. ఇందులో నాగ్‌ ఏడు లక్షల చెక్‌ని గంగవ్వకి అందించారు. మొత్తంగా ఈ ఈవెంట్‌ ఆడియెన్స్‌ ని ఉర్రూతలూగించింది.

బిగ్‌బాస్‌ నాల్గో సీజన్‌లో పాల్గొన హాట్‌ టాపిక్‌గా మారింది గంగవ్వ. గతంలో ఎప్పుడూ లేని విదంగా పెద్ద వయస్కురాలైన గంగవ్వని కంటెస్టెంట్ గా ఎంపిక చేసి ఈ సీజన్‌ స్పెషల్‌ అని  నిరూపించారు బిగ్‌బాస్‌ నిర్వాహకులు. అయితే అనారోగ్యం  కారణంగా ఆమె మధ్యలోనే హౌజ్‌ నుంచి తప్పుకున్నారు. కానీ తాను సొంతం ఇల్లు కట్టుకోవాలని తన కోరిక అని గంగవ్వ పదే పదే చెప్పింది. ఆ కోరిక నెరవేర్చేందుకు బిగ్‌బాస్‌ టీమ్‌ రెడీ అయ్యింది. ఇంటికి కావాల్సిన అమౌంట్‌ని అందిస్తామని చెప్పింది. దాదాపు 20 లక్షలు అవసరం అవుతున్న నేపథ్యంలో ఆ మొత్తాన్ని ఇచ్చేందుకు సిద్ధమయ్యింది. 

ఇందులో భాగంగా బిగ్‌బాస్‌ హోస్ట్ నాగార్జున కూడా గంగవ్వకి పర్సనల్‌గా డబ్బులిస్తున్నట్టు తెలిసింది. అంతేకాదు తాజాగా ఈ ఆదివారం `బిగ్‌బాస్‌4` రీ యూనియన్‌ పార్టీ `బిగ్‌బాస్‌4 ఉత్సవం` పేరుతో నిర్వహించారు. ఇందులో నాగ్‌ ఏడు లక్షల చెక్‌ని గంగవ్వకి అందించారు. కంటెస్టెంట్స్‌ అందరు కలిసి ఈ చెక్‌ని అందించారు. అంతేకాదు అమ్మా రాజశేఖర్‌ మాస్టర్‌ కూడా తన వంతు సాయాన్ని అందించారు. గంగవ్వకి యాభై వేలు పర్సనల్‌గా అందించారు. 

మరోవైపు `బిగ్‌బాస్‌4 ఉత్సవం` అద్యంతం సందడిగా సాగింది. కంటెస్టెంట్స్ తన ఆనందాలను పంచుకున్నారు. బిగ్‌బాస్‌ హౌజ్‌లోని జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు. చేదుజ్ఞాపకాలను చూసి ఎమోషనల్ అయ్యారు. కలిసి ఆడి పాడారు. స్టేజ్‌పై స్టెప్పేసి ఎంజాయ్‌ చేశారు. ఆడియెన్స్ కి వినోదాన్ని పంచారు. ఇందులో ఒకరికొరు గిఫ్ట్స్ ఇచ్చుకున్నారు. లాస్య.. నోయెల్‌కి వాచ్‌ గిఫ్ట్ గా ఇచ్చింది. మోనాల్‌.. గంగవ్వకి పట్టు శారీ గిఫ్ట్ గా ఇచ్చింది. ఫ్రెండ్‌, సోదరుడిగా భావించే సోహైల్‌కి జాకెట్‌ని గిఫ్ట్ గా ఇచ్చింది. మరోవైపు తన ప్రియుడిగా ప్రచారం అవుతున్న అఖిల్‌కి కూడా జాకెట్‌ని తెచ్చి సర్‌ప్రైజ్‌ చేసింది. 

మరోవైపు అఖిల్‌.. గంగవ్వకి పట్టు శారీ తెచ్చాడు. ఫ్రెండ్‌ సోహైల్‌కి ఇష్టమైన షూస్‌ తీసుకొచ్చాడు. మరోవైపు ఇక తన ప్రియురాలు మోనాల్‌కి పట్టా గొలుసులు తెచ్చాడు. తేవడమే కాదు,  స్టేజ్‌పైనే ఆమె కాళ్లని తన మోకాలిపై పెట్టుకుని తన చేతితో ఆ పట్టా గొలుసులు పెట్టి ఆమెపై తనకున్న ప్రేమని చాటుకున్నారు. ఈ సందర్భంగా యాంకర్‌ శ్రీముఖి వారిని లవర్స్ అంటూ సంభోదించడం హైలైట్‌గా మారింది. ఇలా ఒకరికొరు గిఫ్ట్స్ ఇచ్చుకున్నారు. 

బిగ్‌బాస్‌ హౌజ్‌లో తమని బాధపెట్టించిన విషయాలు గుర్తు చేసుకుంటూ ఎమోషనల్‌ అయ్యారు. వాటిని మర్చిపోయే, చేదు జ్ఞాపకాలను కాల్చేసి ఇకపై మంచి స్నేహితులుగా ఉంటామని చాటుకున్నారు. ఇందులో దేత్తడి హారిక వేసిన డాన్స్, దివి డాన్స్ ఉర్రూతలూగిస్తే, అలాగే అవినాష్‌, అరియానా కలసి చేసి డాన్స్ ఎమోషనల్‌గా హృదయాలను కదిలించాయి. మరోవైపు అరియానా, సోహైల్‌ మధ్య పలు ఫన్సీ సీన్స్ కడుపుబ్బ నవ్వించాయి. సోహైల్‌, అఖిల్‌, మెహబూబ్‌ కలిసి చేసిన ఫ్రెండ్‌షిప్‌ డాన్స్ ఆకట్టుకుంది. ఇందులో ఒకరికి ఒకరు క్షమాపణలు చెప్పుకుని కలిసిపోయారు. ఎంజాయ్‌ చేశారు. మొత్తంగా షో ఊర్రూతలూగించిందని చెప్పొచ్చు.

PREV
AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories

భగవంతుడా ఒక్క ఫ్లాప్ ఇవ్వు అని వేడుకున్న చిరంజీవి డైరెక్టర్ ఎవరో తెలుసా? వరుసగా 16 సక్సెస్ లు తట్టుకోలేకపోయాడా?
Gunde Ninda Gudi Gantalu Today ఎపిసోడ్ డిసెంబర్ 16 బాలుని సవతి తల్లిలా చూశాను... ప్రభావతిలో మొదలైన పశ్ఛాత్తాపం