ఆమె నాకు పది ముద్దులు పంపింది అంటున్న మన్మధుడు నాగ్!

By team teluguFirst Published Mar 16, 2021, 4:25 PM IST
Highlights

వైల్డ్ డాగ్ ట్రైలర్ కి ఫ్యాన్స్, స్టార్స్ ఫిదా అవుతుండగా... నాగ్ సతీమణి అమల సైతం స్పందించారట. నాగార్జునకు 10 కిస్సులు, 10 హార్ట్ ఎమోజీలు మరియు 10స్టార్స్ సింబల్స్ పంపారట. తన భార్య పంపిన ప్రేమ పూర్వక సందేశాన్ని నాగార్జున ఫ్యాన్స్ కి తెలియజేశాడు.

కింగ్ నాగార్జున లాస్ట్ మూవీ మన్మధుడు2. రొమాంటిక్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈచిత్రం ఘోరపరాజయం అందుకుంది. రకుల్ హీరోయిన్ గా నటించిన ఈ చిత్రంలో నాగార్జున పాత్ర కొంచెం విమర్శల పాలైంది. వయసుకు దగ్గ పాత్రలో కాకుండా... ఆయన ప్లే బాయ్ గా కనిపించడం చాలా మందికి నచ్చలేదు. దీనితో కొంత గ్యాప్ తీసుకున్న నాగార్జున... ఓ యాక్షన్ ఎంటర్టైనర్ తో మన ముందుకు రానున్నాడు. నాగార్జున ఎన్ ఐ ఏ ఏజెంట్ రోల్ చేస్తుండగా.. వైల్డ్ డాగ్ అనే టైటిల్ తో తెరకెక్కింది. ఇటీవల విడుదలైన వైల్డ్ డాగ్ ట్రైలర్ విశేష స్పందన దక్కించుకుంచుకుంది. ఎన్కౌంటర్ స్పెషలిస్ట్ విజయ్ వర్మగా నాగార్జున ఇరగదీశారు.

ఇక మహేష్, చిరంజీవి లాంటి స్టార్స్ నాగ్ వైల్డ్ డాగ్ ట్రైలర్ ని పొగుడుతూ ట్వీట్స్ వేశారు. ట్రైలర్ అద్భుతం అంటూ నాగార్జున నటనను పొగిడేశారు. వైల్డ్ డాగ్ ట్రైలర్ కి ఫ్యాన్స్, స్టార్స్ ఫిదా అవుతుండగా... నాగ్ సతీమణి అమల సైతం స్పందించారట. నాగార్జునకు 10 కిస్సులు, 10 హార్ట్ ఎమోజీలు మరియు 10స్టార్స్ సింబల్స్ పంపారట. తన భార్య పంపిన ప్రేమ పూర్వక సందేశాన్ని నాగార్జున ఫ్యాన్స్ కి తెలియజేశాడు.

ఇక ఏప్రిల్ 2న వైల్డ్ డాగ్ వరల్డ్ వైడ్ గా విడుదల కానుంది. వైల్డ్ డాగ్ కోసం నాగార్జున స్పెషల్ ట్రైనింగ్‌ తీసుకున్నాడు. డేవిడ్‌ ఇస్మలోన్‌, శ్యామ్‌ కౌశిక్‌ పర్యవేక్షణలో ఫైటింగ్‌ సీన్లు ప్రాక్టీస్‌ చేశాడు. యదార్థ సన్నివేశాల ఆధారంగా రూపుదిద్దుకుంటున్న వైల్డ్‌ డాగ్‌ సినిమాకు అహిషోర్‌ సల్మాన్‌ దర్శకత్వం వహిస్తుండగా మ్యాట్నీ ఎంటర్‌టైన్‌మెంట్‌ పతాకంపై నిరంజన్‌ రెడ్డి, అన్వేష్‌ రెడ్డి నిర్మిస్తున్నారు. 

 

click me!