కృష్ణ అంత్యక్రియలకు దూరంగా నాగార్జున‌.. కారణం అదేనా?.. అలా క్లారిటీ ఇచ్చారా?

Published : Nov 21, 2022, 02:51 PM IST
కృష్ణ అంత్యక్రియలకు దూరంగా నాగార్జున‌.. కారణం అదేనా?.. అలా క్లారిటీ ఇచ్చారా?

సారాంశం

సూపర్‌ స్టార్‌ కృష్ణ హఠాన్మరణంతో యావత్‌ టాలీవుడ్‌ చిత్ర పరిశ్రమ దిగ్బ్రాంతికి గురయ్యింది. టాలీవుడ్‌ సెలబ్రిటీలంతా పాల్గొన్నారు. కానీ నాగార్జున రాలేదు. కారణం ఏంటనేది ఆసక్తికరంగా మారింది. 

సూపర్‌ స్టార్‌ కృష్ణ గత వారం రోజుల క్రితం కన్నుమూసిన విషయం తెలిసిందే. మల్టీ ఆర్గాన్స్ ఫెయిల్యూర్‌, బ్రెయిన్‌ స్ట్రోక్‌ కారణంగా ఆయన తుదిశ్వాస విడిచారు. కృష్ణ మరణంతో యావత్‌ తెలుగు పరిశ్రమనే కాదు, ఇండియన్‌సినిమా ప్రముఖులు సైతం దిగ్భ్రాంతికి గురయ్యారు. టాలీవుడ్‌ మొత్తం కదిలి వచ్చింది. ఇరు రాష్ట్రాల సీఎంలు, చిరంజీవి, వెంకటేష్‌, బాలకృష్ణ, ప్రభాస్‌, పవన్‌, ఎన్టీఆర్‌, అల్లు అర్జున్‌, విజయ్‌ దేవరకొండ, నాగచైతన్య, అఖిల్‌, మోహన్‌బాబు, ఆల్మోస్ట్ అందరు హీరోలు పాల్గొన్నారు. 

అలాగే త్రివిక్రమ్‌, కొరటాల శివ, మెహర్‌ రమేష్‌ వంటి దర్శకులు, ఇతర నటీనటులు పాల్గొని కృష్ణ భౌతిక కాయాన్ని సందర్శించి నివాళ్లు అర్పించారు. కానీ వీరిలో నాగార్జున మిస్‌ అయ్యారు. ఆయన కృష్ణ పార్థివ దేహాన్ని సందర్శించకపోవడం, నివాళ్లు అర్పించకపోవడం చర్చనీయాంశమైంది. ఏం జరిగింది? ఏదైనా గొడవలా అంటూ చర్చ మొదలైంది. నాగ్‌ రాకపోవడానికి కారణం ఒకటి ఇప్పుడు సోషల్‌ మీడియాలో వినిపిస్తుంది. 

నాగార్జున, కృష్ణ కలిసి `వారసుడు` చిత్రంలో నటించారు. వీరిద్దరి మధ్య మంచి అనుబంధం ఉంది. చాలా క్లోజ్‌ రిలేషన్‌ ఉంది. ఆయనంటే నాగ్‌కి చాలా ఇష్టం. కానీ కృష్ణ హఠాన్మరణంతో నాగ్‌ కుంగిపోయారట. ఆయన్ని నిర్జీవంగా ఉండటాన్ని చూసి తట్టుకోలేక అంత్యక్రియలకు హాజరు కాలేదట. తాజాగా ఈ విషయాన్ని సీనియర్‌ జర్నలిస్ట్ ఒకరు తెలిపారు. గతంలోనూ ఇలాంటి సంఘటనలు జరిగినట్టు తెలిపారు. నాగ్‌ కూడా ఆ కారణంతోనే కృష్ణ అంత్యక్రియలకు హాజరు కాలేకపోవచ్చు అని తెలిపారు. 

ఇదిలా ఉంటే కృష్ణకి నివాళ్లు అర్పించారు నాగ్‌. బిగ్‌ బాస్‌ 6 తెలుగు షోలో ఆయనకు ప్రత్యేకంగా నివాళ్లు అర్పించారు. వీకెండ్‌లో మొదట బిగ్‌ బాస్‌ స్క్రీన్‌పై కృష్ణ ఫోటోని ఉంచి మౌనం వహించారు. ఆయన గొప్పతానాన్ని తెలిపారు. ఇండియన్‌ ఫస్ట్ పాన్‌ ఇండియా స్టార్‌ కృష్ణ అని, సౌత్‌, నార్త్ యాక్టర్స్ తో కలిసి సినిమా తీసిన ఘనత ఆయనదే అని తెలిపారు. ఆయన ఎప్పటికీ జీవించే ఉంటారని తన సంతాపాన్ని ప్రకటించారు నాగార్జున. దీంతో ఓ రకంగా ఈ పుకార్లకి చెక్‌ పెట్టేశారు నాగ్‌. 

PREV
AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Articles on
click me!

Recommended Stories

చికిరీలు గికిరీలు, ఇదేం కథ.. పెద్ది సినిమాపై చీప్ కామెంట్స్.. విశ్వక్ సేన్ ఎలా రియాక్ట్ అయ్యాడో చూడండి
Sobhan Babu `సోగ్గాడు` మూవీతో పోటీ పడి దెబ్బతిన్న ఎన్టీఆర్‌.. శివాజీ గణేషన్‌కైతే చుక్కలే