టైటిల్ బాగుంది కానీ, నాగ్ కు సెట్ అవుతుందా?

Published : Jun 21, 2020, 03:41 PM IST
టైటిల్ బాగుంది కానీ, నాగ్ కు సెట్ అవుతుందా?

సారాంశం

లాక్‌డౌన్‌ సమయంలో తన తదుపరి చిత్రాల కోసం కథలను అన్వేషించే పనిలో పడ్డారు. ఇప్పటికే పలువురు రచయితలు, దర్శకులు నాగార్జునను కలిసి కథలు వినిపించారు. అయితే చాలా కాలం తర్వాత రాజశేఖర్‌కు ‘గరుడవేగ’తో కమర్షియల్‌ హిట్‌ అందించిన ట్యాలెంటెడ్‌ డైరెక్టర్‌ ప్రవీణ్‌ సత్తార్‌ చెప్పిన కథకు నాగార్జున గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చినట్టు తెలుస్తోంది.

కరోనా సంక్షోభంతో షూటింగ్ లు అన్ని ఆగిపోయాయి. అయితే స్టార్స్ ఈ గ్యాప్ లో కొత్త కథలు వింటూ తమ తదుపరి కార్యాచరణకు రంగం సిద్దం చేసుకుంటున్నారు. పరిస్దితిలు మెరుగుపడగానే షూట్ కు వెళ్లాలని నిర్ణయించుకుంటున్నారు. ఈ నేపధ్యంలో సీనియర్ హీరో నాగార్జున సైతం  ఓ కొత్త కథను ఓకే చేసినట్లు సమాచారం.  ఈ చిత్రానికి ‘నా రాత నేనే రాసుకుంటా’ అని టైటిల్ ఫైనల్ చేసారని మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి. ఈ చిత్రంలో నాగార్జున రా ఏజెంట్‌గా కనిపిస్తారని అంటున్నారు.

ప్రస్తుతం ఈ కొత్త ప్రాజెక్టు  ప్రీ-ప్రొడక్షన్ పనులు శర వేగంతో జరుగుతున్నాయి. ఈ చిత్రాన్ని ఆసియన్ సినిమాస్, శరత్ మరార్ సంయుక్తంగా నిర్మిస్తారు. నిజాం లోని సీనియర్ డిస్ట్రిబ్యూషన్ హౌస్‌లలో ఒకటైన ఆసియా సినిమాస్, నాగ చైతన్య లవ్ స్టోరీతో నిర్మాణ రంగంలోకి ప్రవేశిస్తుంది. ఇది వారి రెండవ ప్రొడక్షన్ వెంచర్.

ఇక నాగార్జున... ఆఫీసర్‌, మన్మథుడు2 చిత్రాలతో డిజాస్టర్స్ ని తన ఖాతాలో వేసుకున్నారు. అంతకుముందు చేసిన ‘దేవదాస్‌’ కూడా సరైన స్థాయిలో ఫలితాన్ని ఇవ్వలేదు. ఇలా వరుసగా అన్ని చిత్రాలు బాక్సాఫీస్‌ వద్ద బోల్తాపడటంతో నాగ్ కాస్త వెనకపడ్డారు. దీంతో సినిమాల ఎంపికలో ఆచితూచి అడుగులు వేస్తున్నారు. ప్రస్తుతం అహిషోర్‌ సాల్మన్‌ దర్శకత్వంలో రూపొందుతున్న ‘వైల్డ్‌ డాగ్‌’ అనే చిత్రంలో నటిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన టైటిల్‌, ఫస్ట్‌లుక్‌ పోస్టర్‌ కొత్తగా ఉండటంతో ఈ సినిమాపై అందరిలోనూ ఎక్సపెక్టేషన్స్ మొదలయ్యాయి. ప్రసుతం లాక్‌డౌన్‌ కారణంగా ఈ సినిమా షూటింగ్‌ వాయిదాపడింది.
 
ఇక రాజశేఖర్‌కు ‘గరుడవేగ’తో కమర్షియల్‌ హిట్‌ అందించిన డైరెక్టర్‌ ప్రవీణ్‌ సత్తార్‌. ఆయన చెప్పిన కథకు నాగార్జున గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చినట్టు తెలుస్తోంది. నాగార్జున ఇమేజ్‌ను దృష్టిలో ఉంచుకొని పక్కా  స్క్రిప్ట్‌ను దర్శకుడు రెడి చేసినట్లు సమాచారం. ఈ సినిమాతో మళ్లీ నాగ్ ఫామ్ లోకి వస్తారని ఫ్యాన్స్ భావిస్తున్నారు.
 

PREV
click me!

Recommended Stories

తనూజతో రొమాంటిక్ మూమెంట్స్, సంతోషంతో పొంగిపోయిన కళ్యాణ్.. సంజనకి ఓజీ రేంజ్ ఎలివేషన్
ఆ స్టార్ హీరో వల్ల కెరీర్ నాశనం చేసుకున్న భూమిక, నగ్మా, స్నేహ ఉల్లాల్.. లిస్టులో మొత్తం ఏడుగురు బాధితులు