#Naasaamiranga: షాకింగ్ రేటుకు ఓటిటి డీల్, ఎంతకి, ఎవరికి?

Published : Jan 04, 2024, 01:48 PM IST
#Naasaamiranga: షాకింగ్  రేటుకు ఓటిటి డీల్, ఎంతకి, ఎవరికి?

సారాంశం

 విజయ్ బిన్నీ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ విలేజ్ డ్రామాలో మెయిన్ హీరోయిన్ గా ఆశికా రంగనాథ్ నటిస్తోంది.  ఈ సినిమాపై చాలా ఎక్సపెక్టేషన్స్ పెట్టుకున్నారు. 


 ప్రతీ సంక్రాంతి లాగే ఈ 2024 సంక్రాంతికి కూడా నువ్వా..నేనా అనే రేంజ్‌లో పోటీ రసవత్తరంగా మొదలవుతోంది.  సంక్రాంతి ఫెస్టివల్‌ అయిన తర్వాత లాంగ్‌ రన్‌లో ఎన్ని రోజులు బజ్‌ ని కొనసాగిస్తూ కలెక్షన్స్‌ రాబడుతుంది అనేది మూవీ ఏ రేంజ్‌ హిట్‌ అనేది తెలుస్తుంది. ఈ రేసులోకి నాగార్జున కూడా నా సామిరంగ అంటూ దూసుకు వచ్చేసారు.రీసెంట్ గా  ఈ సినిమా ఓటిటి బిజినెస్ కూడా ఫినిష్ చేసుకుందని సమాచారం. ఇంతకీ ఎంతకు ఈ సినిమా ఓటిటి రైట్స్ అమ్మారు..ఎవరు కొనుక్కున్నారో చూద్దాం. 

నాగార్జున (Nagarjuna) ఘోస్ట్ మూవీ తర్వాత గ్యాప్ తీసుకుని చేస్తున్న  చేస్తున్న సినిమా నా సామిరంగ (Naa Saami Ranga). నాగ్ 99వ (Nag 99) చిత్రంగా వస్తున్న ఈ సినిమా టైటిల్ గ్లింప్స్ ను ఆగస్ట్ 29న ఆయన పుట్టినరోజు (Nagarjuna Birthday) సందర్భంగా విడుదల చేస్తే మంచి రెస్పాన్స్ వచ్చింది. తాజాగా పాట సైతం రిలీజ్ చేసారు. విజయ్ బిన్ని దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాకు ఆస్కార్ విజేత ఎమ్ఎమ్ కీరవాణి సంగీతం అందిస్తున్నారు. నా సామిరంగ చిత్రాన్ని కూడా సంక్రాంతి బరిలో నిలిపారు మేకర్స్.   ఈ మేరకు అఫీషియల్ ప్రకటన వచ్చేసింది. ఇక ఈ సినిమా ఓటిటి బిజినెస్ కాలేదని అందుకే సంక్రాంతికి ఈ సినిమా రాకపోవచ్చనే వార్తలు వచ్చాయి. అయితే మంచి రేటుకు ఓటిటి రైట్స్ అమ్మారని తెలుస్తోంది. 

ట్రేడ్ వర్గాల నుంచి అందుతున్న సమాచారం మేరకు ఈ చిత్రం ఓటిటి రైట్స్ 18 కోట్లకు అమ్ముడుపోయాయని వినికిడి. ఇది తెలుగు సినిమా వరకూ రికార్డ్ ప్రైస్ అనే చెప్పాలి. డిస్నీ హాట్ స్టార్ Disney Hotstar వారు ఈ చిత్రం రైట్స్ తీసుకున్నారు. నాగార్జున సినిమాలు ఓటిటి లో బాగా వెళ్లటం, బిగ్ బాస్ ఎఫెక్ట్ తో ఈ రేటు వచ్చిందని తెలుస్తోంది.  సాధారణంగా రీమేక్ చిత్రాలకు ఈ రేటు పలకదు. మళయాళంలో మంచి సక్సెస్ సాధించిన  పోరంజు మరియం జోస్ ‘Porinju Mariam Jose’కు ఈ చిత్రం రీమేక్ .
 

PREV
click me!

Recommended Stories

Top 10 Movies 2025: పవన్, వెంకటేష్, రాంచరణ్ లలో బాక్సాఫీస్ వద్ద ఎవరి సత్తా ఎంత ? 2025లో టాప్ 10 మూవీస్ ఇవే
Akhanda 2: అఖండ 2 రిలీజ్ కి తొలగిన అడ్డంకులు, మద్రాస్ హైకోర్టు గ్రీన్ సిగ్నల్.. కానీ ఆ ఒక్క సమస్య ఇంకా ఉంది