బేబి సినిమా నిర్మాత SKN కు పితృవియోగం...

Published : Jan 04, 2024, 01:13 PM IST
బేబి సినిమా నిర్మాత SKN కు పితృవియోగం...

సారాంశం

ప్రముఖ నిర్మాత  SKN ఇంట విషాదం నెలకొంది. ఆయన  తండ్రి గారు గాదె సూర్యప్రకాశరావు గారు అనారోగ్యంతో బాధపడుతు కన్ను మూశారు.    

బేబీసినిమాతో ఓవర్ నైట్ స్టార్ గా మారిన నిర్మాత ఎస్ కే ఎన్ ఇంట విషాదం నెలకొంది.ఎక్కేఎన్ తండ్రి గాదే సూర్య ప్రకాశ్ రావు  ఈ రోజు ఉదయం హైదరాబాద్ లో స్వర్గస్థులయ్యారు. అనారోగ్య కారణాల వల్ల ఆయన మరణించినట్టు తెలుస్తోంది. ఈ విషయం తెలిసి ఇండస్ట్రీ ప్రముఖులు ఎస్కేఎన్ ను పరామర్శిస్తున్నారు. వారి కుటంబసభ్యులకు ప్రగాఢ సంతాపం తెలియజేస్తున్నారు. 

ఇక నిర్మాత SKN గారి తండ్రి గాదె సూర్యప్రకాశరావు గారి అంత్యక్రియలు ఈరోజు సాయంత్రం 4 గం.లకు ఫిలింనగర్ లోని మహాప్రస్థానం లో జరుగుతాయని సమాచారం. ఇక చిన్న ఫిల్మ్ రిపోర్టర్ గా కెరీర్ ను స్టార్ట్ చేసిన ఎస్ కే ఎన్... ఆతరువాత అల్లు అర్జున్ పీఆర్ఓగా మారారు. ఆతరువాత డిస్ట్రీబ్యూటర్ గా ఎదిగి.. అల్లు అరవింద్ ఫ్యామిలీతో ఉన్న సాన్నిహిత్యంతో నిర్మాతగా అవతారం ఎత్తారు. 

చిన్న చిన్న సినిమాలు తీస్తూ వచ్చిన ఎస్ కే ఎన్.. లాస్ట్ ఇయర్ తన స్నేహితుడు సాయి రాజేష్ డైరెక్షన్ లో చేసిన బేబీ సినిమా సంచలన విజయం సాధించింది. విజయ్ దేవరకొండ తమ్ముడు ఆనంద్ దేవరకొండ హీరోగా.. వైష్ణవిని హీరోయిన్ గా పరిచయం చేస్తూ చేసిన ఫెయిల్యూర్ లవ్ స్టోరీ సంచలన విజయం నమోదు చేసింది. నిర్మాతగా ఎస్ కే ఎన్ ను ఇండస్ట్రీలో నిలబెట్టింది. 
 

PREV
click me!

Recommended Stories

Bigg Boss Telugu 9 Winner Fix: బిగ్‌ బాస్‌ విన్నర్‌ ముందే ఫిక్స్.. అదే జరిగితే సరికొత్త హిస్టరీకి శ్రీకారం
Sara Arjun: ధురంధర్ స్టార్ సారా అర్జున్ రూ.12 కోట్ల లగ్జరీ ఫ్లాట్.. వైరల్ ఫోటోలు