ఓటీటీని ప్రారంభించబోతున్న నాగార్జున.. ప్లాన్‌ ఇదేనా?

Published : May 02, 2021, 05:07 PM IST
ఓటీటీని ప్రారంభించబోతున్న నాగార్జున.. ప్లాన్‌ ఇదేనా?

సారాంశం

ఓటీటీ ప్లాట్‌ఫామ్స్ తెలుగులో మంచి ఆదరణ పొందుతున్నాయి. తెలుగు కంటెంట్‌ని అందిస్తున్నాయి. దీంతో నాగార్జున సైతం ఓటీటీని ప్రారంభించాలని ప్లాన్‌ చేస్తున్నారట.

నాగార్జున మరో కొత్త వ్యాపారంలోకి అడుగుపెడుతున్నాడా? ఆయన డిజిటల్‌లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నాడా? అంటే అవుననే టాక్‌ చిత్ర వర్గాల నుంచి వినిపిస్తుంది. నాగ్‌ ఇప్పుడు ఓటీటీని ప్రారంభించబోతున్నట్టు తెలుస్తుంది. ప్రస్తుతం ఓటీటీలకు ప్రాధాన్యత పెరిగింది. కరోనా పుణ్యమా అని ఎంటర్టైన్‌మెంట్‌కి సంబంధించి బాగా డిమాండ్‌ పెరిగిందంటే అది ఓటీటీకి మాత్రమే. సినిమాని థియేటర్‌లోనే చూడాలనే మాటకి కొత్త అర్థాన్నిస్తుందీ ఓటీటీ ప్లాట్‌ఫామ్‌. డైరెక్టర్‌గా ఇప్పుడు సినిమాని ఓటీటీలోనే చూసుకునే అవకాశం దక్కుతుంది. అదే సమయంలో పెద్ద సినిమాలు కూడా విడుదలైన నెల రోజుల్లోనే ఈ ఓటీటీ యాప్స్ లో చూసుకునే అవకాశం లభిస్తుంది. ఇప్పటికే అనేక ఓటీటీలు రన్‌ అవుతున్నాయి. 

అమెజాన్‌ ప్రైమ్‌, నెట్‌ఫ్లిక్స్, జీ5, ఆహా వంటి ఓటీటీ ప్లాట్‌ఫామ్స్ తెలుగులో మంచి ఆదరణ పొందుతున్నాయి. తెలుగు కంటెంట్‌ని అందిస్తున్నాయి. దీంతో నాగార్జున సైతం ఓటీటీని ప్రారంభించాలని ప్లాన్‌ చేస్తున్నారట. తన అన్నపూర్ణ స్టూడియో నుంచి దీన్ని లాంచ్‌ చేయాలని భావిస్తున్నారట. థియేటర్‌కి, టీవీకి ఆల్టర్‌నేట్‌గా వచ్చిన ఓటీటీ ఇప్పుడు ఎంటర్‌టైన్‌మెంట్‌ని శాషించబోతుంది. భవిష్యత్‌లో వినోదం మొత్తం వీటి చుట్టే తిరుగబోతుందనే ఆలోచనతో నాగ్‌ ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది. నాగ్‌, తన ఫ్రెండ్స్ తో కలిసి ఓ ఓటీటీని ప్రారంభించాలనుకుంటున్నారట. మరి ఇందులో నిజమెంతా అనేది తెలియాల్సి  ఉంది. కానీ ఇప్పుడీ వార్త మాత్రం సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతుంది.

నాగార్జున ఇటీవల `వైల్డ్ డాగ్‌`చిత్రంలో నటించారు. ఈ సినిమా థియేటర్ లో విడుదలై ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోయింది. కానీ ఇటీవల అమెజాన్‌ ప్రైమ్‌లో విడుదలై మంచి వ్యూస్‌ని పొందుతుంది. హిట్‌ టాక్‌ని తెచ్చుకుంది. సినిమా విడుదల సమయంలోనే ఇది ఓటీటీ కంటెంట్‌ అనే టాక్‌ వచ్చింది. అన్నట్టుగానేది ఇది సక్సెస్‌ కావడం విశేషం. ప్రస్తుతం ఆయన ప్రవీణ్‌ సత్తారు దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నారు. ఇందులో కాజల్‌ హీరోయిన్‌.

PREV
AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories

Renu Desai ని రిజెక్ట్ చేసిన తెలుగు స్టార్‌ హీరో ఎవరో తెలుసా? బద్రి కంటే ముందే ఇంత కథ జరిగిందా?
Chiranjeeviకి ఊహించని గిఫ్ట్ తో సర్‌ప్రైజ్‌ చేసిన కృష్ణంరాజు.. మెగాస్టార్‌ మర్చిపోలేని బర్త్ డే