నాగ్, జగపతిల చౌదరీ బంధం!

Published : Nov 10, 2018, 11:17 AM IST
నాగ్, జగపతిల చౌదరీ బంధం!

సారాంశం

జగపతి బాబు, నాగార్జున కమ్మ వర్గానికి చెందిన వారు అనే సంగతి తెలిసిందే. వీరిద్దరూ ఒకరినొకరు కాస్ట్ పేరుతోనే పిలుచుకుంటారట. ఈ విషయాన్ని ఓ ఇంటర్వ్యూలో జగపతిబాబు స్వయంగా వెల్లడించాడు. అలా అని వారికి కాస్ట్ ఫీలింగ్ ఉందనుకునేరు.. జగపతిబాబు కాస్ట్ ఫీలింగ్ చాలా తక్కువ. తన కూతురిని ఓ విదేశీయుడికి ఇచ్చి మరీ పెళ్లి చేశాడు. 

జగపతి బాబు, నాగార్జున కమ్మ వర్గానికి చెందిన వారు అనే సంగతి తెలిసిందే. వీరిద్దరూ ఒకరినొకరు కాస్ట్ పేరుతోనే పిలుచుకుంటారట. ఈ విషయాన్ని ఓ ఇంటర్వ్యూలో జగపతిబాబు స్వయంగా వెల్లడించాడు. అలా అని వారికి కాస్ట్ ఫీలింగ్ ఉందనుకునేరు..

జగపతిబాబు కాస్ట్ ఫీలింగ్ చాలా తక్కువ. తన కూతురిని ఓ విదేశీయుడికి ఇచ్చి మరీ పెళ్లి చేశాడు. ఆ సమయంలో తన కాస్ట్ కి సంబంధించిన పెద్దలు జగపతిబాబుని వ్యతిరేకించినా ఆయన మాత్రం కూతురు మనసుని అర్ధం చేసుకొని ఆమెకి పెళ్లి చేశాడు. నాగార్జునకి కూడా అంతే.. కొడుకు ప్రేమ వివాహానికి అంగీకరించాడు.

అయితే వీరిద్దరూ కాస్ట్ పేరు పెట్టి పిలవడానికి ఓ కారణం ఉందట. నిజానికి జగపతి బాబుకి ఆయన తాతగారి పేరు పెట్టారు. దీంతో తనను పేరు పెట్టి పిలవలేక ఇంట్లో వాళ్లు చౌదరి అని పిలవడం మొదలుపెట్టారట. అలా అతడి సన్నిహితులు అదే పేరుతో పిలిచేవారట.

జగపతిబాబు తండ్రి రాజేంద్రప్రసాద్, ఏఎన్నార్ మంచి స్నేహితులు. దీంతో నాగార్జున, జగపతిబాబుల మధ్య మంచి స్నేహం ఏర్పడింది. జగపతిబాబుని నాగర్జున చౌదరీ అని పిలిస్తే.. జగపతి కూడా నాగ్ ని అలానే పిలిచేవారట. 

ఇది కూడా చదవండి..

అవును.. తాగి నటించాను: జగపతిబాబు

PREV
click me!

Recommended Stories

IMDb రిపోర్ట్ ప్రకారం 2025 లో టాప్ 10 పాపులర్ సినిమాలు ఏవంటే?
Akhanda 2 Premiers: అఖండ 2 చిత్రానికి మరో కోలుకోలేని దెబ్బ.. ప్రీమియర్ షోల అనుమతి రద్దు చేసిన హైకోర్టు