అవును.. తాగి నటించాను: జగపతిబాబు

Published : Nov 10, 2018, 10:15 AM IST
అవును.. తాగి నటించాను: జగపతిబాబు

సారాంశం

హీరోగా ఎన్నో సినిమాలు చేసిన నటుడు జగపతిబాబు ఆ తరువాత విలన్ గా టర్న్ తీసుకున్నాడు. ఇప్పుడు ఆయన కెరీర్ పీక్ స్టేజ్ లో ఉంది. స్టార్ హీరోల సినిమాలలో విలన్ పాత్రలు, తండ్రి పాత్రలు చేస్తూ బిజీబిజీగా గడుపుతున్నారు.

హీరోగా ఎన్నో సినిమాలు చేసిన నటుడు జగపతిబాబు ఆ తరువాత విలన్ గా టర్న్ తీసుకున్నాడు. ఇప్పుడు ఆయన కెరీర్ పీక్ స్టేజ్ లో ఉంది. స్టార్ హీరోల సినిమాలలో విలన్ పాత్రలు, తండ్రి పాత్రలు చేస్తూ బిజీబిజీగా గడుపుతున్నారు.

ఇది ఇలా ఉండగా.. హీరోగా బిజీగా ఉన్న సమయంలోనే జగపతిబాబు 'అంతఃపురం' అనే సినిమాలో అతిథి లాంటి పాత్రలో నటించారు. ఆ సమయంలో ఆ పాత్ర చేయొద్దని జగపతిబాబుకి చాలా మంది అభిమానులు చెప్పారట. కానీ జగపతిబాబు మాత్రం ఆ సినిమాలో నటించిన తన పాత్రను రక్తి కట్టించాడు.

ఈ సినిమాలో తాగి నటించినట్లుగా అంగీకరించాడు జగపతిబాబు. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆయన ''తాగి నటించడం కరెక్ట్ అని నేను చెప్పను. కానీ ఆ సమయంలో అలా చేసేసాం. కొన్ని సినిమాలు, కొన్ని సందర్భాల్లో అలా చేయాల్సి వస్తుంది. అడవిలో అభిమన్యుడు సినిమా చేస్తున్నప్పుడు నాన్నే తాగమని బాటిల్ పంపించేవారు. ఆ సినిమాలో ఎత్తైన కొండలు ఎక్కడం, నీళ్లలోపల ఉండడం వంటి సన్నివేశాలు చేయాల్సివుంది. 

దానికోసం ధైర్యం కావాలి. అలా తాగాల్సి వచ్చింది. అయినా.. నేనేమైనా రేపులు, మర్డర్లు చేశానా..? ఓ రెండు సీన్లు కోసం తాగాను అంతే.. ఎవరినీ కొట్టలేదు. దాన్ని సమర్ధించుకోవడం అంటారో ఇంకేం అంటారో నాకు తెలియదు కానీ యాక్టింగ్ చేసుకుంటూ నా పద్దతిలో నేను వెళ్లిపోయాను. అన్ని సినిమాలలో తాగి నటించను కదా'' అంటూ చెప్పుకొచ్చారు. 

PREV
click me!

Recommended Stories

Trisha: సీఎం విజయ్‌కు సెల్యూట్ చేసిన త్రిష, స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో హీరోయిన్ ఫోటోలు వైరల్
NTR: బాబూ మన సినిమాకి థియేటర్లు బద్దలైపోతున్నాయ్, హీరోకి అనుచరులు చెప్పిన ఫస్ట్ షో టాక్..రియాలిటీ తుస్సు