పదిహేనేళ్ల తర్వాత పూరీతో నాగ్‌ ?

Published : Aug 22, 2020, 02:37 PM IST
పదిహేనేళ్ల తర్వాత పూరీతో నాగ్‌ ?

సారాంశం

ఈ సూపర్‌ కాంబినేషన్‌లో సినిమా రాక దాదాపు పదిహేనేళ్ళు అవుతుంది. అన్ని అనుకున్నట్టు జరిగితే.. 15ఏళ్ల తర్వాత నాగార్జున, పూరీ జగన్నాథ్‌ కాంబినేషన్‌లో సినిమా రాబోతుందట. 

కింగ్‌ నాగార్జున, డేరింగ్‌ అండ్‌ డాషింగ్‌ డైరెక్టర్‌ పూరీ జగన్నాథ్‌ కాంబినేషన్‌ `శివమణి`, `సూపర్‌` చిత్రాలు వచ్చి మంచి విజయాలను సాధించాయి. `సూపర్‌` కాస్త యావరేజ్‌గా నిలిచినా, `శివమణి` మాత్రం ట్రెండ్‌ సెట్టర్‌గా నిలిచింది. ముఖ్యంగా ఇందులోని `98480..` అంటూ చెప్పే  ఫోన్‌ నెంబర్‌ సెన్సేషనల్‌ అయ్యింది. 

ఈ సూపర్‌ కాంబినేషన్‌లో సినిమా రాక దాదాపు పదిహేనేళ్ళు అవుతుంది. అన్ని అనుకున్నట్టు జరిగితే.. 15ఏళ్ల తర్వాత నాగార్జున, పూరీ జగన్నాథ్‌ కాంబినేషన్‌లో సినిమా రాబోతుందట. దాదాపుగా పూరీ సినిమాకి మన్మథుడు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చారని తెలుస్తుంది. 

ప్రస్తుతం నాగార్జున `వైల్డ్ డాగ్‌` చిత్రంలో నటిస్తున్నారు. సోల్మాన్‌ దర్శకత్వం వహిస్తున్నారు. దీంతోపాటు ప్రవీణ్‌ సత్తార్‌ డైరెక్షన్‌లో ఓ సినిమాకి గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చారు. ఈ రెండు సినిమాల తర్వాత పూరీ దర్శకత్వంలో నాగ్‌ సినిమా ఉంటుందని టాక్‌. మరోవైపు పూరీ జగన్నాథ్‌ ప్రస్తుతం విజయ్‌ దేవరకొండ హీరోగా `ఫైటర్‌` చిత్రాన్ని పాన్‌ ఇండియా సినిమాగా తెరకెక్కిస్తున్నారు. ఇది తెలుగు, హిందీలో రూపొందుతుంది. ఆ తర్వాత కొత్త సినిమా ఇంకా ఫైనల్‌ కాలేదు. అన్ని కుదిరితే నాగ్‌ సినిమా ఉండే ఛాన్స్ ఉందని టాక్. 

PREV
AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories

తనూజతో రొమాంటిక్ మూమెంట్స్, సంతోషంతో పొంగిపోయిన కళ్యాణ్.. సంజనకి ఓజీ రేంజ్ ఎలివేషన్
ఆ స్టార్ హీరో వల్ల కెరీర్ నాశనం చేసుకున్న భూమిక, నగ్మా, స్నేహ ఉల్లాల్.. లిస్టులో మొత్తం ఏడుగురు బాధితులు