అందువల్లే నేను సీఎం వద్దకు వెళ్లలేదు: చిరంజీవి, జగన్ భేటీపై స్పందించిన నాగార్జున

By Sumanth KanukulaFirst Published Jan 13, 2022, 1:41 PM IST
Highlights

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌తో (YS jagan) ప్రముఖ హీరో చిరంజీవి (Chiranjeevi) భేటీపై మరో హీరో నాగార్జున (Nagarjuna) స్పందించారు. మొత్తం సినీ పరిశ్రమ అందరి కోసమే జగన్‌తో చిరంజీవి మాట్లాడటానికి వెళ్లారని చెప్పారు.

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌తో (YS jagan) ప్రముఖ హీరో చిరంజీవి (Chiranjeevi) భేటీపై మరో హీరో నాగార్జున (Nagarjuna) స్పందించారు. మొత్తం సినీ పరిశ్రమ అందరి కోసమే జగన్‌తో చిరంజీవి మాట్లాడటానికి వెళ్లారని చెప్పారు. తన సినిమా విడుదల ఉండటం వల్ల వెళ్లలేకోయానని చెప్పారు. తన తాజా చిత్రం బంగర్రాజు సినిమా ప్రమోషన్‌లో భాగంగా నాగార్జున మీడియాతో మాట్లాడుతూ ఈ కామెంట్స్ చేశారు. జగన్‌కు చిరంజీవి అంటే ఇష్టమని చెప్పారు. ప్రస్తుత పరిస్థితుల గురించి తాను చిరంజీవి అప్పుడప్పుడు మాట్లాడుకుంటూనే ఉంటామని నాగార్జున చెప్పారు. 

చిరంజీవి తనకు ఫోన్ చేసి సీఎం జగన్‌ను కలవబోతున్నట్టుగా చెప్పారని నాగార్జున తెలిపారు. కానీ బంగార్రాజు సినిమా ప్రమోషన్స్‌, ప్రీరిలీజ్‌ ఈవెంట్‌ ఉండటంతో రావటం కుదరదని చెప్పినట్టుగా వెల్లడించారు. ఈ భేటీతో అంతా మంచే జరుగుతుందని ఆశిస్తున్నట్టుగా చెప్పారు. 


కొద్ది రోజుల క్రితం సినిమా టికెట్ల ధరలపై స్పందించింది కేవలం తన సినిమా వరకు మాత్రమేనని నాగార్జున చెప్పారు. గతేడాది జీవో నెం.35 విడుదల చేశారని చెప్పారు. జీవో విడుదలయ్యాకే తన సినిమా ప్రారంభమైందని తెలిపారు. ఆ రేట్ల ప్రకారం తన సినిమాకు ఏం ఇబ్బంది లేదని అనిపించిందన్నారు. రేట్లు పెరిగితే మాకు బోనస్‌ వచ్చినట్లేనని తెలిపారు. సినిమా ఆడకపోతే చేసేదేమీ లేదని.. దాని కోసం సినిమా రిలీజ్‌ చేయకుండా ఉండలేనని నాగార్జున చెప్పుకొచ్చారు. 

ఇక, తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో సీఎం జగన్‌తో చిరంజీవి భేటీ కొనసాగుతుంది. కొంతకాలంగా ఏపీలో సినిమా టికెట్ల ధరల వివాదం కొనసాగుతుంది. ఇది రోజురోజుకు ముదురుతుంది. ఈ క్రమంలోనే చిరంజీవి రంగంలోకి దిగినట్టుగా తెలుస్తోంది. సినిమా టికెట్ల ధరల వివాదంతో పాటుగా, చిత్ర పరిశ్రమలో నెలకొన్న సమస్యల గురించి సీఎం జగన్‌తో చిరంజీవి ఈ సందర్బంగా చర్చించే అవకాశం ఉంది. 

ఈ సమావేశంలో పాల్గొనడానికి  ముందు గన్నవరం ఎయిర్ పోర్టు వద్ద చిరంజీవి మీడియాతో మాట్లాడారు.  సీఎం వైఎస్ జగన్ ఆహ్వానం మేరకు తాను  వచ్చినట్టుగా చిరంజీవి చెప్పారు. సీఎం జగన్ తో అన్ని విషయాలపై చర్చిస్తానని ఆయన చెప్పారు. మరో గంటన్నరలో అన్ని విషయాలపై క్లారిటీ ఇస్తానని చిరంజీవి తెలిపారు. 

click me!