గాన గంధర్వుడికి బిగ్‌బాస్‌ ఘన నివాళి.. బిగ్‌బాస్‌ తెలుగు 4 అంకితం

Published : Sep 26, 2020, 03:27 PM IST
గాన గంధర్వుడికి బిగ్‌బాస్‌ ఘన నివాళి.. బిగ్‌బాస్‌ తెలుగు 4 అంకితం

సారాంశం

గాన గంధర్వుడికి తెలుగు `బిగ్‌బాస్‌` ఘనంగా నివాళి అర్పించింది. అంతేకాదు `బిగ్‌బాస్‌ తెలుగు 4` ఓ వీడియోని ఆయనకు అంకితమిచ్చింది. 

గాన గంధర్వుడికి తెలుగు `బిగ్‌బాస్‌` ఘనంగా నివాళి అర్పించింది. అంతేకాదు `బిగ్‌బాస్‌ తెలుగు 4` ఓ వీడియోని ఆయనకు అంకితమిచ్చింది. ఈ మేరకు బిగ్‌బాస్‌ 4 హోస్ట్  నాగార్జున, స్టార్‌మా ట్విట్టర్‌ ద్వారా తెలిపింది. ఆయనకు నివాళ్ళర్పిస్తూ ఓ స్పెషల్‌ వీడియోని పంచుకుంది. 

ఇందులో నాగ్‌.. బాలుకి నమస్కరిస్తూ, `ఆ స్వరం ఇక పలకదు.. ఆ వరం ఇక లేదని సరగమలన్నీ కన్నీళ్లు పెట్టాయి.. రాగాలన్నీ బాధపడ్డాయి.. దాచుకో స్వామి దాచుకో.. మా బాలుని జాగ్రత్తగా దాచుకో..` అని నాగార్జున భావోద్వేగానికి గురవుతూ నివాళి అర్పించారు. 

బిగ్‌బాస్‌ 3 మూడో వారాంతానికి చేరుకుంది. నేడు(శనివారం) నాగార్జున హోస్ట్ గా మెరవనున్న విషయం తెలిసిందే. ఎలిమినేషన్‌ ప్రక్రియ కూడా జరుగుతుంది. మరోవైపు బిగ్‌బాస్‌లోకి నటి స్వాతి దీక్షింత్‌ శుక్రవారం వైల్డ్ కార్డ్ ద్వారా ఎంట్రీ ఇచ్చారు. 

PREV
AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories

Christmas Movies: క్రిస్మస్‌ కానుకగా విడుదలయ్యే సినిమాలివే.. కుర్రాళ్లతో శివాజీ ఫైట్‌.. ఒకే రోజు ఏడు సినిమాలు
అమ్మాయిల దుస్తులపై శివాజీ వల్గర్ కామెంట్స్...చిన్మయి, అనసూయ స్ట్రాంగ్ కౌంటర్