నాగార్జున, కళ్యాణ్ రామ్ కలిసి నటిస్తున్నరా.?

Published : Jun 25, 2018, 02:54 PM IST
నాగార్జున, కళ్యాణ్ రామ్ కలిసి నటిస్తున్నరా.?

సారాంశం

నందమూరి ఆర్ట్స్ బ్యానర్ లో నాగార్జున

ఇటీవల కల్యాణ్ రామ్ హీరోగా చేసిన సినిమాలు ఆయనకి పెద్దగా కలిసి రాలేదు. దాంతో ఆయన తన సొంత బ్యానర్లో తనే హీరోగా ఒక సినిమా చేయడానికి సన్నాహాలు చేసుకుంటున్నాడు. ఈ సినిమాకి పవన్ సాధినేని దర్శకుడిగా వ్యవహరించనున్నాడు. ఇది మల్టీ స్టారర్ మూవీ అని తెలుస్తోంది.

ఒక కథానాయకుడిగా చేయనున్న కల్యాణ్ రామ్ .. మరో హీరోగా నాగార్జున అయితే బాగుంటుందని భావించాడట. ఆ వెంటనే నాగ్ కి కథ చెప్పడం .. ఆయన ఓకే అనడం జరిగిపోయాయి. ఈ సినిమాలో నాగార్జున పాత్ర చాలా డిఫరెంట్ గా ఉంటుందనీ .. ఆ కొత్తదనం కారణంగానే ఆయన కథ వినగానే గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడని అంటున్నారు. ప్రస్తుతం నాగార్జున .. నానితో కలిసి ఒక సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా షూటింగు పూర్తికాగానే, కల్యాణ్ రామ్ తో కలిసి సెట్స్ పైకి వెళ్లనున్నాడని చెబుతున్నారు. త్వరలోనే మిగతా వివరాలు తెలియనున్నాయి.  

PREV
click me!

Recommended Stories

Superstar Krishna: కృష్ణ నటించిన ఏకైక సీరియల్‌ ఏంటో తెలుసా? బుల్లితెరపై అదో బ్లాక్‌ బస్టర్‌
Venu Swamy: సినిమా జ్యోతిష్యుడు వేణు స్వామి ఎంత ఫీజు వసూలు చేస్తాడో తెలుసా? ఆయనే స్వయంగా ఏమన్నాడంటే?