టాలీవుడ్ కింగ్ నాగార్జున.. తమిల స్టార్ హీరో ధనుష్ కాంబో మూవీ నుంచి సాలిడ్ అప్ డేట్ అందింది. ఈసినిమాకు టైటిల్ ఫిక్స్ చేసినట్టు తెలుస్తోంది. ఇంతకీ ఈ పవర్ ఫుల్ మూవీకి ఏం టైటిల్ ఫిక్స్ చేశారంటే..?
కింగ్ నాగార్జున , తమిళ స్టార్ హీరో ధనుష్ కాంబినేషన్ లో మూవీ తెరెక్కుతున్న సంగతి తెలిసిందే. టాలీవుడ్ సెన్సిబుల్ డైరెక్టర్ శేఖర్ కమ్ములా రూపొందిస్తున్న ఈమూవీ షూటింగ్ కూడా ఇప్పటికే తిరుపతిలో స్టార్ట్ అయ్యింది. మాఫియా నేపథ్యంలో సాగే కథతో ఈసినిమాను తెరకెక్కిస్తున్నట్టుగా తెలుస్తోంది. ఈసినిమాను చాలా కాలం క్రితమే అనౌన్స్ చేసి పక్కన పెట్టారు ధనుష్ , శేఖర్ కమ్ముల. తాజాగా ఈ సినిమా పట్టాలెక్కింది. ముందుగా శేఖర్ తో సినిమా చేయాల్సి ఉంది ధనుష్. కాని కొన్ని పరిణామాల వల్ల ఆయన ముందుగా వెంకీ అట్లూరితో సార్ సినిమా చేశారు.
ఇక ముందుగా అనుకున్నట్టే ధనుష్ మూవీ పట్టాలెక్కింది. రీసెంట్ గా ఓపెనింగ్ చేసుకున్న ఈసినిమా అప్పుడే సెట్స్ పైకి వెళ్ళింది. అయితే ఈసినిమాలో ధనుష్ తో పాటు టాలీవుడ్ కింగ్ నాగార్జున్ కూడా నటిస్తుండటం విశేషం. రీసెంట్ గా నా సామిరంగ సినిమాతో హిట్ కొట్టిన నాగార్జున శేఖర్ కమ్ముల ధనుష్ సినిమాలో చాలా ఇంపార్టెంట్ పాత్ర చేస్తున్నాడు. సర్ సినిమాతో ధనుష్ డైరెక్ట్ తెలుగు సినిమా చేసి భారీ హిట్ కొట్టాడు. ఇప్పటికే పూజా కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమా.. రీసెంట్ గా షూటింగ్ కూడా స్టార్ట్ చేసుకున్నారు.
అయితే ఈమూవీ షూటింగ్ ఇప్పటికే తిరుపతిలో స్టార్ట్ అయింది. సూపర్ ఫాస్ట్ గా షూటింగ్ జరిగేలా ప్లాన్ చేశారట టీమ్. ఇక ఈమూవీ నుంచి సాలిడ్ అప్ డేట్ కూడా ప్లాన్ చేసినట్టు తెలుస్తోంది. ఇప్పటికే ఈసినిమాకుటైటిల్ కూడా ఫిక్స్ చేశారట. ధనుష్, నాగార్జున హీరోలుగా శేఖర్ కమ్ముల తెరకెక్కిస్తున్న సినిమాకు 'ధారవి' టైటిల్ ఖరారు చేశారని తెలిసింది. ముంబైలో మురికివాడ ధారవి. ఈ నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కుతోంది. అందుకని, ఆ టైటిల్ అయితే యాప్ట్ అని మూవీ టీమ్ ఫిక్స్ అయ్యిందట.
ఇక దారావీ బ్యాక్ డ్రాప్ తో ఇంప్పటికే చాలా సినిమాలు వచ్చాయి. అందులో కొన్ని తమిళ సినిమాలు కూడా ఉన్నాయి. మరి ఈసినిమా వాటికంటే డిఫరెంట్ గా ఉంటుందా లేదా అనేది చూడాలి. ఈ సినిమాలో మాఫియా డాన్ పాత్రలో నాగార్జున నటిస్తున్నారట. ధారవి ప్రాంతానికి చెందిన యువకుడిగా ధనుష్ రోల్ డిజైన్ చేసినట్లు టాక్. మరి.. హీరోయిన్ పాత్రను శేఖర్ కమ్ముల ఎలా డిజైన్ చేశారన్నది చూడాలి. ఈమూవీలో ధనుష్ సరసన హీరోయిన్ గా రష్మిక మందన్న నటిస్తోంది. ఫస్ట్ టైమ్ శేఖర్ కమ్ముల కాస్త డిఫరెంట్ గా ట్రై చేస్తున్నారు. మరి ఈ కాన్సెప్ట్ లో అతను సక్సెస్ అవుతాడా లేదా అన్నది చూడాలి.