Nagarjuna Adopts Forest: 1000 ఎకరాల అడవిని దత్తత తీసుకున్న నాగార్జున.. ఏం పేరు పెట్టారో తెలుసా..?

Published : Feb 17, 2022, 12:12 PM IST
Nagarjuna Adopts Forest: 1000 ఎకరాల అడవిని దత్తత తీసుకున్న నాగార్జున..  ఏం పేరు పెట్టారో తెలుసా..?

సారాంశం

రీల్ లోనే కాదు రియల్ హీరో కూడా అనిపించుకున్నాడు కింగ్ నాగార్జున (Nagarjuna). మనుషులకు ప్రాణ వాయువులు అందిస్తున్న చెట్లను కాపాడుకునేందకు తన వంతుగా ముందుకు కదిలాడు

రీల్ లోనే కాదు రియల్ హీరో కూడా అనిపించుకున్నాడు కింగ్ నాగార్జున (Nagarjuna). మనుషులకు ప్రాణ వాయువులు అందిస్తున్న చెట్లను కాపాడుకునేందకు తన వంతుగా ముందుకు కదిలాడు.

టాలీవుడ్ కింగ్ నాగార్జున (Nagarjuna) సినిమాల్లో కాదు రియల్ గా హీరో అనిపించుకున్నాడు. మన కెందుకు వచ్చిన ఇబ్బంది అని అనుకోకుండా తెలంగాణ‌లో ఏకంటా 1000 ఎకరాల రిజర్వ్ ఫారెస్ట్ ను దత్తత తీసుకుంటున్నాడు అక్కినేని హీరో. ఈ విషయం  అక్కినేని నాగార్జున (Nagarjuna)  గ‌తంలో ప్రకటించారు కాని ఇప్పుడు ఇది ఆచరణలో పెట్టి చూపించాడు.

ఈ రోజు( ఫిబ్రవరి 17) తెలంగాణ  సీఎం కేసీఆర్(KCR) జ‌న్మ‌దినోత్స‌వం సంద‌ర్భంగా.. ఈ  కార్యక్రమానికి శ్రీ కారం చుట్టాడు నాగార్జున Nagarjuna. మేడ్చల్ జిల్లా లోని చెంగిచెర్ల లో ఉన్న అడవిని నాగార్జున అడాప్ట్ చేసుకున్నారు. త‌న భార్య అక్కినేని అమ‌ల‌, మంత్రి మ‌ల్లారెడ్డి, ఎంపీ సంతోష్ కుమార్ తో క‌లిసి వెళ్లి  చెంగిచెర్ల‌లో నాగార్జున‌ (Nagarjuna) అడ‌విని సందర్శించాడు.. దత్త‌త కార్యక్రమాన్ని పూర్తి చేశాడు.


అంతే కాదు తాను దత్తత తీసుకున్న అడవికి నామకరణం కూడా చేశాడు నాగార్జున (Nagarjuna). అడవికి అక్కినేని నాగేశ్వ‌ర‌రావు అర్బ‌న్ ఫారెస్ట్ అని పేరు కూడా పెట్టాడు. అంతే కాదు అక్కడ పారెస్ట్ డెవలప్ మెంట్ కు సంబంధించిన ఏర్పాట్లకు శంకుస్థాప‌న చేశారు. కేసీఆర్(KCR) పుట్టిన‌రోజు సంద‌ర్భంగా గ్రీన్ ఇండియా చాలెంజ్‌లో భాగంగా నాగార్జున అడ‌విని ద‌త్త‌త తీసుకున్నారు. అక్కడ మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో నాగార్జునతో పాటు ఆయన తనయులు నాగ చైత‌న్య(Naga Chaitanya), అఖిల్(Akhil) కూడా పాల్గొన్నట్టు తెలుస్తోంది.

రీసెంట్ గా బంగార్రాజు(Bangarraju, ) సినిమా సూపర్ హిట్ తో ఫుల్ జోష్ లో ఉన్నాడు నాగార్జున, నాగచైతన్య. అటు మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ సినిమా హిట్ తో అఖిల్ కూడా హుషారుగా ఉన్నాడు. నాగ్ ప్రవీన్ సత్తార్ డైరెక్షన్ లో ఘోస్ట్ మూవీ చేస్తుండగా.. నాగచైతన్య విక్రమ్ కుమార్ తో థ్యాంక్యూ మూవీ చేశారు. వెబ్ సిరీస్ పనుల్లో బిజీగా ఉన్నాడు. అటు చైతూ లాల్ సింగ్ చద్దా  కూడా రిలీజ్ కు ముస్తాబు అవుతోంది. మరో వైపు అఖిల్(Akhil) సురేందర్ రెడ్డి తో  ఏజంట్ మూవీ  హడావిడిలో ఉన్నాడు.

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Bigg Boss Telugu 9 title Winner: నాగార్జున డైలాగ్‌తో చెప్పి మరీ కప్‌ కొట్టిన కళ్యాణ్‌, ఎమోషనల్‌ కామెంట్‌.. తనూజకే క్రెడిట్‌
Bigg Boss Telugu 9: రమ్య మోక్ష చేత అందరి ముందు క్షమాపణలు చెప్పించిన కళ్యాణ్‌.. పరువు పోయిందిగా