
కొట్టాయం ప్రదీప్ గా పేరుపొందిన ప్రముఖ మలయాళ నటుడు ప్రదీప్ కేఆర్ గురువారం (ఫిబ్రవరి 17) గుండెపోటుతో కన్నుమూశారు. ఆయనకు ప్రస్తుతం 61 ఏళ్లు. కొట్టాయం ప్రదీప్ ఆకస్మిక మరణం మలయాళ చిత్ర పరిశ్రమను దిగ్భ్రాంతికి గురి చేసింది. ఆయనకు భార్య మాయ, ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఈయన మలయాళం, తమిళంతో పాటు తెలుగులో నూ అక్కినేని నాగచైతన్య ( Naga Chaithanya) నటించిన ‘ఏం మాయ చేశావే’మూవీలోనూ నటించారు. జార్జ్ అంకుల్ పాత్రలో ఒదిగిపోయి తెలుగు ప్రేక్షకులను కూడా అలరించారు.
అయితే కొట్టాయం ప్రదీప్ మరణ వార్త విన్న నటుడు ‘పృథ్వీరాజ్ సుకుమారన్ (Prithviraj Sukumaran) విచారం వ్యక్తం చేశారు. సోషల్ మీడియా వేదికన ఆయనకు అంతిమ నివాళ్లులు అర్పించారు. ప్రదీప్ నవ్వుతూ ఉన్న ఫొటోను షేర్ చేస్తూ నివాళి అర్పించారు. వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు. మరోవైపు అభిమానులు, సెలబ్రెటీలు ఈ విషయం తెలుసుకున్న వెంటనే సోషల్ మీడియాలో నివాళ్లు అర్పిస్తున్నారు. మంచి నటుుడిని కోల్పోయామంటూ బాధపడుతున్నారు.
కాగా కేరళలోని కొట్టాయంలో తుదిశ్వాస విడిచారు. ఆయన అంత్యక్రియలకు సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలో వెల్లడి కానున్నాయి. ప్రదీప్ కొట్టాయం మరణ వార్త విని దర్శకుడు జాన్ మహేంద్రన్ కూడా షాక్ అయ్యారు. తన ఫోటోను ట్విట్టర్ లో షేర్ చేస్తూ నివాళి అర్పించారు. ‘మలయాళ చిత్ర పరిశ్రమ చాలా సహజ నటుడు ప్రదీప్ కొట్టాయం కోల్పోయారు’ అని పేర్కొన్నారు.
40 ఏండ్ల వయసులో ప్రదీప్ తన కెరీర్ ను ప్రారంభించాడు. మొదట్లో సినిమాల్లో కామెడీ పాత్రలు పోషించాడు. 2001 నుంచి ఇప్పటి వరకు 70 సినిమాల్లో నటించాడు. ‘ఒరు వడక్కన్ సెల్ఫీ’, ‘కుంజిరామాయణం’, ‘ఆడు ఒరు భీగర జీవి ఆను’, ‘వెల్‌కమ్ టు సెంట్రల్ జైలు’, ‘కట్టపనయిలే రిత్విక్ రోషన్’, ‘అమర్ అక్బర్ ఆంటోనీ’ వంటి సినిమాల ఆయనకు మంచి పేరు తెచ్చిపెట్టాయి.