నాగార్జున (Nagarjuna) ఘోస్ట్ మూవీ తర్వాత గ్యాప్ తీసుకుని చేస్తున్న చేసిన సినిమా నా సామిరంగ (Naa Saami Ranga).
నాగార్జున సినిమాలు ఏమీ ఇప్పుడు అంతగా ఆడటం లేదు. ఒకప్పుడు టాలీవుడ్ మన్మధుడుగా కీర్తింబడ్డ ఆయన క్రేజ్ మసకబారుతోందనే చెప్పాలి. అయితే మధ్య మద్యలో నేనూ రేసులో ఉన్నాను అని చెప్పటానికి బంగార్రాజు,నా సామిరంగ లాంటివి వర్కవుట్ అవుతున్నాయి. ఆయన ఫ్యాన్ బేస్ ఇద్దరు కొడుకులు నాగచైతన్య, అఖిల్ లకు స్ప్లిట్ అయ్యింది. అలాగే నాగార్జున కు వీరాభిమానులు అనుకున్న వాళ్లు వయస్సు పెరిగి..ఓటిటిల్లో సినిమాలు చూస్తున్నారు. ఈ క్రమంలో సంక్రాంతి సినిమాగా రిలీజై మరోసారి నాగార్జునకు హిట్ ఇచ్చిన మూవీ నా సామిరంగ. పెద్దగా అంచనాలు లేకుండానే రిలీజైన ఈ మలయాళ రీమేక్ తెలుగు రాష్ట్రాల్లో బ్రేక్ ఈవెన్ సాధించింది. ఇప్పుడీ సినిమా ఓటీటీలోకి అడుగుపెట్టడానికి రెడీ అవుతోంది. అయితే అదే సమయంలో ఈ సినిమా ఓవర్ సీస్ లో వాష్ అవుట్ అయిన విషయం బయిటకు వచ్చింది.
ట్రేడ్ నుంచి అందుతున్న సమాచారం మేరకు ఈ చిత్రం తెలుగు రెండు రాష్ట్రాల్లో సేఫ్ వెంచరే. అయితే ఓవర్ సీస్ లో మాత్రం 50% కూడా పెట్టుబడిలో రికవరీ చేయలేక వాష్ అవుట్ అయ్యింది. అంటే అక్కడ నాగార్జున కు మార్కెట్ డౌన్ అయ్యిందా అనే అంటన్నారు. అంతేకాకుండా పండగ వీకెండ్ అయ్యిపోయిన తర్వాత పూర్తిగా డ్రాప్ అయ్యింది తెలుగు రాష్ట్రాల్లో కూడా. ఇది నాగార్జున వంటి సీనియర్ హీరో స్టేటర్ కు సరిపడే విషయం కాదు. ఇంకాస్త జాగ్రత్తపడాలి. ఏదో హిట్ అనిపించుకుంటే నాగ్ స్దాయికి సరిపోదు అంటున్నారు.
అయితే కేవలం మూడు నెలల కాలంలో చిత్రనిర్మాణాన్ని పూర్తి చేసి, ఎక్కడా ఎవ్వరినీ నొప్పించకుండా సజావుగా షూటింగ్ కార్రక్రమాలను పూర్తి చేసి, సంక్రాంతికి నా సామిరంగాని పందెం కోడిని వదిలినట్టుగా వదిలటం మాత్రం గ్రేటే. ఈ సినిమా మంచి హిట్టై మళ్లీ నాగార్జునని ఫామ్ లోకి తెచ్చింది.దర్శకుడు విజయ్ బిన్ని ఈ క్రెడిట్ నంతా థాంక్స్ గివింగ్ మీట్ లో తన యూనిట్ కే ఇచ్చాడు. తనకున్నలాటి డెరెక్షన్ టీం ఎవరికున్నా ఇంతే స్పీడుగా పూర్తి చేయగలుగుతారు అని చెప్పి టీంకి థాంక్స్ చెప్పాడు.
ఇక ఈ చిత్రం ఓటిటి రైట్స్ 18 కోట్లకు అమ్ముడుపోయాయని వినికిడి. ఇది తెలుగు సినిమా వరకూ రికార్డ్ ప్రైస్ అనే చెప్పాలి. డిస్నీ హాట్ స్టార్ Disney Hotstar వారు ఈ చిత్రం రైట్స్ తీసుకున్నారు. నాగార్జున సినిమాలు ఓటిటి లో బాగా వెళ్లటం, బిగ్ బాస్ ఎఫెక్ట్ తో ఈ రేటు వచ్చిందని తెలుస్తోంది. సాధారణంగా రీమేక్ చిత్రాలకు ఈ రేటు పలకదు. మళయాళంలో మంచి సక్సెస్ సాధించిన పోరంజు మరియం జోస్ ‘Porinju Mariam Jose’కు ఈ చిత్రం రీమేక్ .