వైన్ షాప్ దగ్గర మందు అడుకుంటున్న ముక్కు అవినాశ్.. ట్విస్ట్ ఏంటంటే....?

Published : Feb 04, 2024, 07:11 AM IST
వైన్ షాప్ దగ్గర మందు అడుకుంటున్న  ముక్కు అవినాశ్..  ట్విస్ట్ ఏంటంటే....?

సారాంశం

ఓ వైన్ షాప్ దగ్గర మందు కావాలంటూ.. అడుకుంటున్నాడు జబర్థస్త్ ఫేమ్ ముక్కు అవినాశ్.  మందుబాబులు కూడా పోటీపడి అవినాశ్ కు మందు ఇప్పించడానికి రెడీ అయ్యారు.. ఇక ఈమధ్యలో ట్విస్ట్ ఏంటంటే..? 


జబర్థస్త్ తో అంత ఫేమస్ అయిన ముక్కు అవినాశ్ మందు అడుక్కోవడం ఏంటి..? అది కూడా 90 ఎమ్మెల్ బాటిల్ ఇప్పించండి అంటూ.. మందు  బాబులను రిక్వెస్ట్ చేయడం ఏంటీ అని అందరికి డౌట్ రావచ్చు. ఇక అసలు విషయం ఏంటీ అంటే..? ఇది ఒక మూవీ ప్రమోషన్. బిగ్‌ బాస్‌ ఫేమ్‌ యంగ్‌ హీరో సయ్యద్‌ సోహైల్‌ ప్రధాన పాత్రలో నటించిన  సినిమా బూట్‌కట్‌ బాలరాజు. ఇందులో సోహెల్ తో పాటు.. అతని స్నేహితుడి పాత్రలో  జబర్దస్త్‌ కమెడియన్‌ ముక్కు అవినాష్ ఒక కీలక పాత్రలో నటించాడు. శ్రీ కోనేటి డైరెక్ట్ చేసిన ఈసినిమాను ఎండి.పాషా నిర్మించగా.. ఈ సినిమా హీరో సోహైల్ కూడా సహ నిర్మాతగా ఉన్నాడు. 

ఇక బూట్ కట్‌ బాలరాజు సినిమాలో మేఘ లేఖ, సునీల్, సిరి హన్మంత్, ఇంద్రజ తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు.  ఈమూవీ శుక్రవారం (ఫిబ్రవరి 02) థియేటర్లలో రిలీజ్ అయ్యింది.  బూట్‌ కట్‌ బాలరాజు  సినిమా పర్వాలేదు అనిపించింది. ఇక ఈసినిమాను చూడాలంటూ స్వయంగా రంగంలోకి దిగాడు హీరో సోహెల్. తన సినిమా చూడాలి అంటూ..ఎమోషనల్ గా మాట్లాడాడు. మోకాల మీద కూర్చుని రెండు చేతులెత్తి దండంపెడుతూ.. ఆడియన్స్ ను వేడుకున్నాడు. ఇది ఇలా ఉంటే.. తమ సినిమాను జనాల్లోకి తీసుకెళ్లడం కోసం రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారు. తాజాగా ముక్కు అవినాశ్ కాస్త వెరైటీగా ప్రమోషన్స్‌ నిర్వహించాడు.

 కమెడియన్‌ ముక్కు అవినాష్‌ తన స్నేహితులతో కలిసి రోడ్లపై తిరుగుతూ.. ‘బూట్ కట్ బాలరాజు’ సినిమా చూడాలని ప్రచారం నిర్వహించాడు. ఈ నేపథ్యంలో ఓ వైన్‌ షాపు దగ్గరకు వెళ్లిన అవినాష్‌ అక్కడున్న మందు బాబుల్ని తనకూ 90 ఎంఎల్‌ మందు బాటిల్‌ ఇప్పించాలని అడిగాడు. తన దగ్గర డబ్బుల్లేవని.. అయితే మందు తాగాలని ఉందని నాకు ఒక 90 ఇప్పించండని మందు బాబుల్ని అడిగాడు. దీంతో చాలామంది అతనికి మందు పోయించడానికి  ముందుకు వచ్చారు. పోటీ పడి మరీ మేము  ఇప్పిస్తాం.. అంటూ ముందుకు వచ్చారు. 

కాని అక్కడ ట్విస్ట్ ఏంటంటే..అలా ముందుకు వచ్చినవారందరికి రివర్స్ లో అవినాశ్ ఫ్రీగా మందు పంపిణీ చేశాడు. ఒక్కొక్కరికి  90 ఎమ్మోల్ బాటిల్ ను ఫ్రీగా పంచాడు అవినాశ్. దీంతో దిల్ ఖుష్ అయిన మందుబాబులు.. ఆనందంతో పొంగిపోయారు  జై అవినాష్‌ అన్నా అంటూ నినాదాలు చేశారు. మరికొందరయితే నువ్వ దేవుడుసామీ అంటూ. తమ సంతోషాన్ని వ్యక్తం చేశారు మందు బాబులు.  ఇక పనిలో పనిగా అవినాశ్ సినిమా ప్రమోషన్ కూడా చేశాడు.  తన బూట్ కట్ బాలరాజు సినిమా చూడాలని వారిని కోరాడు అవినాష్. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు  సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. 

PREV
click me!

Recommended Stories

ఆ స్టార్ హీరో వల్ల కెరీర్ నాశనం చేసుకున్న భూమిక, నగ్మా, స్నేహ ఉల్లాల్.. లిస్టులో మొత్తం ఏడుగురు బాధితులు
BMW Teaser: 'భర్త మహాశయులకు విజ్ఞప్తి' టీజర్ రివ్యూ.. వరుస డిజాస్టర్లతో రూటు మార్చిన రవితేజ, రొమాన్స్ షురూ