నాలుగో షెడ్యూల్ షూటింగ్ లో ఏంజిల్

Published : Jan 17, 2017, 09:06 AM ISTUpdated : Mar 25, 2018, 11:41 PM IST
నాలుగో షెడ్యూల్ షూటింగ్ లో ఏంజిల్

సారాంశం

దర్శకధరీడు రాజమౌళి అసోసియేట్ బాహుబలి పళని దర్శకత్వంలో ఏంజిల్ హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో నాల్గోవ షెడ్యూల్ షూటింగ్

మన్యంపులి వంటి సూపర్ హిట్ తరువాత శ్రీ సరస్వతి ఫిల్మ్స్ బ్యానర్ పై తెరకెక్కుతోన్న సోషియోఫాంటసీ ఎంటర్ టైనర్ ఏంజెల్. గతేడాది షూటింగ్ మొదలుపెట్టిన ఈ చిత్ర యూనిట్ ఇప్పటికే మూడు షెడ్యూల్స్ దిగ్విజయంగా పూర్తిచేసుకొని తాజాగా జనవరి 16 నుంచి హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో నాల్గోవ షెడ్యూల్ షూటింగ్ జరుపుకుంటోంది. యంగ్ టాలెండ్ హీరో నాగఅన్వేష్, బ్యూటీ క్వీన్ హెబ్బా పటేల్ జంటగా తెరకెక్కుతోన్న ఈ సినిమాకి దర్శకధరీడు రాజమౌళి అసోసియేట్ బాహుబలి పళని దర్శకత్వం వహిస్తున్నారు. ఇక ప్రస్తుతం జరుగుతోన్న షెడ్యూల్ ని జనవరి నెలాఖరు వరకు నిర్విహించేందుకు ప్లాన్ చేస్తున్నట్లుగా ఈ చిత్ర నిర్మాత భువన్ సాగర్ తెలిపారు.

 

ఈ సినిమాలోసప్తగిరి, ప్రదీప్ రావత్, షియాజీ షిండే కీలక పాత్రలు పోషిస్తున్నారు. బెంగాల్ టైగర్ ఫేమ్ భీమ్స్ సెస్సరోలియో ఈ చిత్రానికి మ్యూజిక్ అందిస్తున్నారు. ముప్పా వెంగయ్య చౌదరిసమర్పణలో సరస్వతి ఫిల్మ్స్ బ్యానర్ పై భువన్ సాగర్ అత్యంత ప్రతిష్ఠాత్మకంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి రచన : శ్రీనివాస్ లంకపల్లి, ఆర్ట్‌: వి.ఎస్. సాయిమణి,స్టంట్స్‌: రామ్ లక్ష్మణ్, డైలాగ్స్‌: వేంపల్లి రమేశ్ రెడ్డి, ఎడిటర్‌: చోట.కె.ప్రసాద్, సినిమాటోగ్రఫీ: గుణ.

PREV
click me!

Recommended Stories

Rajini Kamal Movie: రజినీకాంత్ తో సినిమా ఎప్పుడు? కమల్ హాసన్ ఓపెన్‌ కామెంట్స్..
Ustaad Bhagat Singh Collection: పవన్ కళ్యాణ్ అభిమానులకు రెండో రోజు షాక్ ఇచ్చిన కలెక్షన్లు..