'నేను నా అవినీతి'.. నాగబాబు స్కిట్ చూశారా..?

Published : Feb 03, 2019, 11:42 AM IST
'నేను నా అవినీతి'.. నాగబాబు స్కిట్ చూశారా..?

సారాంశం

సినీ నటుడు నాగబాబు స్పెషల్ గా ఓ యూట్యూబ్ ఛానెల్ పెట్టుకొని రాజకీయాలపై సెటైర్లు వేస్తోన్న సంగతి తెలిసిందే. తాజాగా ఆయన ఓ స్కిట్ చేసి ఆ వీడియోను వదిలారు. అధికార, ప్రతిపక్ష పార్టీలను టార్గెట్ చేస్తూ.. 'నేను నా అవినీతి' అనే కామెడీ స్కిట్ ని విడుదల చేశారు.

నాలుగున్నర నిమిషాల నిడివి ఉన్న ఈ వీడియోకి పేరు పెట్టకుండా.. స్కిట్ చూసిన తరువాత మీరే పేరు పెట్టాలని నాగబాబు ప్రేక్షకులకు చెప్పారు. ముందుగా ఈ స్కిట్ లో అధికారం పక్ష నాయకుడికి, ప్రతిపక్ష నాయకుడికి 'నేను నా అవినీతి' అనే టాపిక్ ఇచ్చి నాగబాబు వారిద్దరికీ పరీక్ష పెట్టారు.

ఈ పరీక్ష రాబోయే ఎన్నికల్లో చాలా కీలకమని, మీరు మంచి మార్కులు తెచ్చుకోవాలంటూ నాగబాబు చెప్పడంతో అధికార,  ప్రతిపక్ష పార్టీ నాయకులు పోటీ పడి మరీ పరీక్ష రాయడం, అడిషన్ల కోసం గొడవ పడడం ఇందులో చూపించారు.

నాగబాబు జడ్జిగా వ్యవహరించే జబర్దస్త్ రేంజ్ లో ఈ స్కిట్ లో కామెడీ మాత్రం పండించలేకపోయినా.. అతడు అనుకున్నట్లుగా రాజకీయపార్టీలపై విమర్శలు గుప్పించేలా ఉంది. 

PREV
click me!

Recommended Stories

భార్యతో పదేళ్ల ప్రేమను సెలబ్రేట్ చేసుకున్న రిషబ్ శెట్టి..బ్యూటిఫుల్ ఫోటోస్ వైరల్
Medha Rana: బోర్డర్ 2తో ప్రేక్షకుల మనసు గెలిచిన నటి ? ఆమె కుటుంబ సభ్యులంతా..