
అల్లు శిరీష్ హీరోగా మలయాళంలో సూపర్ సక్సెస్ అందుకున్న ఎబిసిడి చిత్రాన్ని తెలుగులో రీమేక్ చేస్తున్న సంగతి తెలిసిందే. శిరీష్ సరసన రుక్సార్ థిల్లాన్ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రం ద్వారా... సంజీవ్‌రెడ్డి దర్శకుడిగా పరిచయమవుతున్నారు.
ఇక ఈ చిత్రంలో అల్లు శిరీష్ తండ్రిగా మెగా బ్రదర్ నాగబాబు కనిపించనున్నారు. నాగబాబు నిజ జీవితంలో అల్లు శిరీష్ కు స్వయానా మావయ్య కావటం విశేషం. నాగబాబు, అల్లు శిరిష్ కు మధ్య సన్నివేశాలు ఇప్పటికే షూటింగ్ ప్రారంభమైంది. ఆ సెట్ లో ఫొటోని అల్లు శిరీష్ సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకున్నారు
ఈ క్రేజీ ప్రాజెక్టును మధుర ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై మధుర శ్రీధర్, బిగ్ బెన్ సినిమాస్ బ్యానర్‌పై యశ్ రంగినేని సంయుక్తంగా నిర్మిస్తున్నారు. బాలనటుడిగా మనల్ని ఎంటర్‌టైన్ చేసిన మాస్టర్ భరత్ అల్లు శిరీష్ స్నేహితుడిగా ఫుల్ లెంగ్త్ క్యారెక్టర్ పోషిస్తున్నాడు.
కన్నడ టాప్ మ్యూజిక్ డైరెక్టర్ జుధా సాంధీ సంగీతం సమకూరుస్తున్నారు. అల్లు శిరీష్, రుక్సార్ తిల్లాన్, భరత్ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి నిర్మాతలు మధుర శ్రీ్ధర్, యశ్ రంగినేని, దర్శకుడు సంజీవ్‌రెడ్డి.