షారుఖ్ ఇంటి ముందు కొత్త జంట వెయిటింగ్!

Published : Dec 15, 2018, 02:00 PM IST
షారుఖ్ ఇంటి ముందు కొత్త జంట వెయిటింగ్!

సారాంశం

చాలా మందికి తమ అభిమాన నటుడ్ని చూడాలని, మాట్లాడాలని, వీలైతే ఓ ఫోటో తీసుకోవాలని అనిపిస్తుంటుంది. ఈ క్రమంలో చాలా మంది తమ అభిమాన నటుల ఇంటి ముందు వారి దర్శనం కోసం పడిగాపులు గాస్తుంటారు. 

చాలా మందికి తమ అభిమాన నటుడ్ని చూడాలని, మాట్లాడాలని, వీలైతే ఓ ఫోటో తీసుకోవాలని అనిపిస్తుంటుంది. ఈ క్రమంలో చాలా మంది తమ అభిమాన నటుల ఇంటి ముందు వారి దర్శనం కోసం పడిగాపులు గాస్తుంటారు.

బాలీవుడ్ లో ఇలాంటి సంస్కృతి మరీ ఎక్కువగా కనిపిస్తుంటుంది. తాజాగా ముంబైలో ఓ జంట ఇలాంటి ప్రయోగమే చేసింది. బాలీవుడ్ స్టార్ హీరో షారుఖ్ ఖాన్ పై ఉన్న అభిమానంతో ఓ జంట వివాహం జరిగిన వెంటనే అతడి ఆశీస్సులు తీసుకోవడం కోసం షారుఖ్ నివాసం మన్నత్ వద్దకు చేరుకున్నారు.

అక్కడ షారుఖ్ సిగ్నేచర్ మూమెంట్ ఫోజులో భార్యాభర్తలిద్దరూ నిల్చొని షారుఖ్ కోసం ఎదురుచూశారు. వారి ఎదురుచూపులు ఫలించి షారుఖ్ ఖాన్ చూడడమే కాదు.. హాయ్ కూడా చెప్పారట. అంతేకాదు.. ఈ నవదంపతులిద్దరికీ షారుఖ్ ట్విట్టర్ ద్వారా ఆశీర్వాదాలు చెప్పారు. దీంతో ఆ జంట ఆనందంలో మునిగిపోయారు. 

 

PREV
click me!

Recommended Stories

Gunde Ninda Gudi Gantalu Today: బాలు పై బయటపడిన ప్రభావతి ప్రేమ, చిటికెలు వేసి మరీ శపథం చేసిన మీన
2025 Flop Movies: 100 కోట్లు దాటినా బాక్సాఫీస్ వద్ద ఫ్లాప్‌ అయిన 8 సినిమాలు