kalki 2898 Ad Trailer : ప్రభాస్ ‘కల్కి 2898 ఏడీ’ ట్రైలర్ ఎప్పుడు వస్తుందో తెలుసా? స్పందించిన నాగ్ అశ్విన్

Published : Dec 29, 2023, 05:16 PM IST
kalki 2898 Ad Trailer :  ప్రభాస్ ‘కల్కి 2898 ఏడీ’ ట్రైలర్ ఎప్పుడు వస్తుందో తెలుసా? స్పందించిన నాగ్ అశ్విన్

సారాంశం

‘కల్కి 2898 ఏడీ’ మూవీ ట్రైలర్ పై దర్శకుడు నాగ్ అశ్విన్ క్రేజీ అప్డేట్ అందించారు. ఇప్పటికే ప్రభాస్ అభిమానులు ‘సలార్’తో దుమ్ములేపుతుండగా.. Kalki 2898 AD Trailerపై స్పందించారు. 

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ Prabhas  నుంచి మోస్ట్ అవైటెడ్ ఫిల్మ్ ‘సలార్’ Salaar ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అభిమానులు ఎలా చూడాలనుకున్నారో అలాగే చూపించారు. డార్లింగ్ ఊచకోతకు ఫ్యాన్స్ ఆకలి తీరింది. దీంతో నెక్ట్స్ ప్రభాస్ లైనప్ లో పాన్ వరల్డ్ గా రూపుదిద్దుకుంటున్న Kalki 2898 Ad మూవీ కోసం ఎదురుచూస్తున్నారు. ఈ చిత్రానికి ‘మహానటి’ ఫేమ్,  క్రియేటివ్ డైరెక్టర్  నాగ్ అశ్విన్ Nag Ashwin దర్శకత్వం వహిస్తున్న విషయం తెలిసిందే. వైజయంతి మూవీస్ బ్యానర్ పై భారీ బడ్జెట్ తో రూపుదిద్దుకుంటోంది. 

ప్రస్తుతం Salaar Cease Fire ప్రేక్షకుల ముందుకు రావడంతో... నెక్ట్స్ ‘కల్కి’పైనే అభిమానుల ఫోకస్ ఉంది. ఈ మూవీ నుంచి ఇప్పటికే ఇంట్రెస్టింగ్ పోస్టర్లు, పవర్ ఫుల్ టీజర్ కూడా విడుదలైంది. ‘సలార్’ మొత్తానికి రిలీజ్ కావడంతో ఈ మూవీ అప్డేట్స్ కోసం ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో ఇటీవల ఓ కార్యక్రమంలో పాల్గొన్న నాగ్ అశ్విన్ ను ఫ్యాన్స్ Kalki 2898 AD Trailer ఎప్పుడని ప్రశ్నించారు. దీని ఆయన బదులిచ్చారని తెలుస్తోంది. 

ఆయన ఆన్సర్ తో ఇప్పట్లో ట్రైలర్ లేదని తేల్చారు. 93 రోజుల తర్వాతే ట్రైలర్ విడుదల అయ్యే అవకాశం ఉందని స్పష్టం చేశారు. అంటే దాదాపు మూడు నెలలకు పైగా సమయం పడుతుంది. అప్పటి వరకు అభిమానులకు ఎదురుచూపులు తప్పవు. ఇదిలా ఉంటే... కల్కిని తొలుత 2024 జనవరి 12నే విడుదల చేస్తామని అధికారికంగా ప్రకటించారు. అందుకు తగ్గట్టుగానే నాగ్ అశ్విన్ మూవీ షూటింగ్ పార్ట్ ను కూడా కంప్లీట్ చేస్తూ వచ్చారు. ఇక ‘సలార్’ ఆలస్యంతో ఈ సినిమా కూడా ఆలస్యంగా రానుందని తెలుస్తోంది. 

‘సలార్’ రిలీజ్ తర్వాత ప్రభాస్ - మారుతీ Maruthi కాంబోలోని సినిమానూ ప్రకటించిన విషయం తెలిసిందే. సంక్రాంతి కానుకగా ఈ చిత్రం ఫస్ట్ లుక్, టైటిల్ రానుంది. ఇక కల్కిమూవీ విషయానికొస్తే.. ఈ చిత్రంలో ప్రభాస్ కి జంటగా దీపికా పదుకొనె నటిస్తున్నారు. కమల్ హాసన్ కీలక రోల్ చేస్తున్నారు. కల్కి రెండు భాగాలుగా తెరకెక్కే అవకాశం కలదు.  అమితాబ్ బచ్చన్ కూడా కీలక పాత్ర పోషిస్తున్నారు. 
 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

నాగార్జున ను 15 ఏళ్లుగా వెంటాడుతున్న అనారోగ్య సమస్య ఏంటో తెలుసా? ఎందుకు తగ్గడంలేదు?
Sivaji: కులం అనేది ఒక ముసుగు మాత్రమే, డబ్బున్నోళ్ల లెక్కలు వేరు.. శివాజీ బోల్డ్ స్టేట్‌మెంట్‌