చిత్ర పరిశ్రమ మనుగడ కష్టం, అర్థం చేసుకోండి... సీఎం జగన్ కి చిరు విజ్ఞప్తి

By team teluguFirst Published Nov 25, 2021, 2:13 PM IST
Highlights

తక్కువ ధరలకు టికెట్స్ అమ్మితే నిర్మాతలు నష్టపోవాల్సి వస్తుందని, వాపోతున్నారు. గతంలో కూడా ఈ విషయమై ముఖ్యమంత్రితో పాటు, మంత్రి పేర్ని నానితో టాలీవుడ్ పెద్దలు చర్చలు జరిపారు. అయినా సానుకూల ఫలితాలు రాలేదు. 
 

సినిమా టికెట్స్ ధరలపై ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం పెద్ద సినిమాల నిర్మాతలకు గొడ్డలిపెట్టులా మారింది. ప్రభుత్వం నిర్ణయించిన ధరలకే టికెట్స్ అమ్మాలని ప్రత్యేక చట్టం తీసుకురావడం జరిగింది. పెద్ద సినిమా చిన్న సినిమా అనే తేడా లేకుండా అన్ని సినిమాల టికెట్స్ రేట్లు ఒకేలా ఉండాలని, అలాగే రోజుకు నాలుగు షోల ప్రదర్శన మాత్రమే చేయాలని, బెనిఫిట్ షోలకు అనుమతి లేదని స్పష్టం చేశారు. 

ఈ పరిణామం టాలీవుడ్ లో తెరకెక్కుతున్న భారీ బడ్జెట్ చిత్రాల నిర్మాతలకు షాక్ ఇచ్చింది. అంత తక్కువ ధరలకు టికెట్స్ అమ్మితే నిర్మాతలు నష్టపోవాల్సి వస్తుందని, వాపోతున్నారు. గతంలో కూడా ఈ విషయమై ముఖ్యమంత్రితో పాటు, మంత్రి పేర్ని నానితో టాలీవుడ్ పెద్దలు చర్చలు జరిపారు. అయినా సానుకూల ఫలితాలు రాలేదు. 

Also read Acharya: 'ఆచార్య' నుంచి పవర్ ఫుల్ అప్డేట్.. చిరుత పులిలా రంగంలోకి 'సిద్ద'
కాగా ఈ విషయంపై తాజాగా చిరంజీవి (chiranjeevi)స్పందించారు. సోషల్ మీడియా వేదికగా సీఎం జగన్ (CM jagan)కి ఆయన ఓ అభ్యర్ధన చేశారు. పరిశ్రమ కోరిన విధంగా టికెట్స్ అమ్మకాలు ఆన్లైన్ చేయడం శుభ పరిణామం. అయితే టికెట్స్ ధరల విషయంలో పునరాలోచించాలని ఆయన వేడుకున్నారు. అనేక మంది పేద ప్రజలు చిత్ర పరిశ్రమపై ఆధారపడి బ్రతుకుతున్నారు, కాలానుగుణంగా టికెట్స్ ధరలు పెంచకపోతే చిత్ర పరిశ్రమ మనుగడ సాధించలేదు. దేశం మొత్తం ఒకే విధమైన జీఎస్టీ వసూలు చేస్తున్నప్పుడు, ఇతర రాష్ట్రాల్లో ఉన్న టికెట్స్ ధరలకు సమానంగా ధరలు పెంచాలని ఆయన విజ్ఞప్తి చేశారు. మరి చిరంజీవి అభ్యర్ధనను ఎస్ జగన్ ఎంత వరకు పరిగణలోకి తీసుకుంటారో చూడాలి.  

ఇక చిరంజీవి కొత్త చిత్రం ఆచార్య వచ్చే ఏడాది ఫిబ్రవరి 4న రిలీజ్ కు రెడీ అవుతోంది. మరో హీరోగా  రామ్ చరణ్ నటిస్తుండగా, ఆయన సరసన ఈ చిత్రంలో పూజా హెగ్డే క్యామియో రోల్ పోషిస్తోంది. ఈ చిత్రంలో కొరటాల శివ పొలిటికల్ అంశాలని కూడా ఇన్వాల్వ్ చేశారట. కొరటాల చిత్రాల్లో కమర్షియల్ అంశాలు ఉంటాయి. కానీ ప్రధానంగా సందేశం హైలైట్ అవుతుంది. మెగాస్టార్ చిరంజీవి లాంటి చరిష్మా ఉన్న నటుడు కొరటాల దర్శకత్వంలో నటిస్తే వెండి తెరపై మ్యాజిక్ ఖాయం అని అంటున్నారు. ఇదిలా ఉండగా ప్రస్తుతం మెగా అభిమానులంతా నవంబర్ 28న వచ్చే సిద్ధ టీజర్ కోసం సిద్ధంగా ఉన్నారు.

Appeal to Hon’ble
Sri. pic.twitter.com/zqLzFX8hCh

— Chiranjeevi Konidela (@KChiruTweets)
click me!