విషాదాంత ప్రేమకథతో నాగ చైతన్య

Published : Jan 28, 2019, 07:51 AM IST
విషాదాంత ప్రేమకథతో నాగ చైతన్య

సారాంశం

 సరైన కథ లేకపోవటం వల్లే హిట్టు రావడం లేదన్న నిర్ణయానికి నాగచైతన్య వచ్చేసాడు. అందు కోసం టాప్ రైటర్ విజయేంద్రప్రసాద్ ని రంగంలోకి దింపారు. తనకు సూట్ అయ్యే ఓ అద్భుతమైన కథను రాయమని విజయేంద్రప్రసాద్ కు చెప్పాడట నాగచైతన్య. దాంతో ఆయన పనిలో పడ్డారు.

`యుద్ధం శరణం` సినిమా నుంచి మొన్న రిలీజ్ అయిన `సవ్యసాచి` వరకు నాగ చైతన్యకు హిట్ అన్నది పడలేదు.  వరుస ఫ్లాపులు పలకరిస్తున్నాయి. దీంతో  విశ్లేషణ చేసుకుని సరైన కథ లేకపోవటం వల్లే హిట్టు రావడం లేదన్న నిర్ణయానికి నాగచైతన్య వచ్చేసాడు. అందు కోసం టాప్ రైటర్ విజయేంద్రప్రసాద్ ని రంగంలోకి దింపారు. తనకు సూట్ అయ్యే ఓ అద్భుతమైన కథను రాయమని విజయేంద్రప్రసాద్ కు చెప్పాడట నాగచైతన్య. దాంతో ఆయన పనిలో పడ్డారు.

ఈ విషయం ఖరారు చేస్తూ ..నాగ చైతన్య కోసం  విజయేంద్ర ప్రసాద్ ఓ మంచి లవ్ స్టోరీ రాస్తున్నానని గతంలో ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. అయితే తాజాగా ఫిల్మ్ నగర్ వర్గాల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం ఈ కథ చైతూ తాతగారు ఏఎన్నార్  సూపర్ హిట్ ‘దేవదాస్’ ఆధారంగా ఆ స్టోరీ లైన్స్ లో వర్కవుట్ చేసారట. ఈ సారి కూడా అంతటి గొప్ప విషాదాంతమైన ప్రేమ కథను చైతు కోసం రాశాడట విజయేంద్ర ప్రసాద్.

కథ పూర్తై, చైతూకు నేరేషన్ కూడా ఇచ్చారట. అయితే ఈ చిత్రానికి ఎవరు దర్శకత్వం వహిస్తారో ఇంకా తెలియాల్సి ఉంది.  చైతూ ప్రస్తుతం నాగ చైతన్య శివ నిర్వాణ దర్శకత్వంలో తన సతీమణి సమంతతో కలిసి ‘మజిలీ’ చిత్రం షూటింగ్ లో బిజీ బిజీగా ఉన్నారు. 

PREV
click me!

Recommended Stories

Bigg Boss Telugu 9 : తనూజ తో ఐటమ్ సాంగ్ చేయిస్తానన్న ఇమ్మాన్యుయేల్, అడ్డంగా బుక్కైన డీమాన్ పవన్.. హౌస్ లో చివరి రోజు సందడి
Emmanuel Remuneration: ఇమ్మూ రెమ్యూనరేషన్‌ మైండ్‌ బ్లోయింగ్‌.. బిగ్‌ బాస్‌ తెలుగు 9 షోకి ఎంత తీసుకున్నాడంటే?