వెంకటేష్ పై శ్రీరెడ్డి స్పెషల్ పోస్ట్..!

Published : Jan 27, 2019, 04:36 PM IST
వెంకటేష్ పై శ్రీరెడ్డి స్పెషల్ పోస్ట్..!

సారాంశం

''చినమామ.. కంగ్రాచ్యులేషన్స్'' అంటూ శ్రీరెడ్డి సోషల్ మీడియాలో విక్టరీ వెంకటేష్ ని ఉద్దేశిస్తూ పెట్టిన పోస్ట్ ఇప్పుడు వైరల్ అవుతోంది. టాలీవుడ్ లో దాదాపు అందరి హీరోలను కెలికేసిన శ్రీరెడ్డి ఇప్పుడు వివాదాలకు దూరంగా ఉండే వెంకటేష్ ని కూడా విడిచిపెట్టలేదు. 

వెంకీ నటించిన 'ఎఫ్ 2' సినిమా విడుదలై సక్సెస్ అందుకున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో అతడికి విషెస్ చెబుతూ కాస్త వెటకారంగా పోస్ట్ పెట్టింది శ్రీరెడ్డి.

''చినమామ, అదే మా వెంకీ మామ సినిమా పెద్ద హిట్ అంటగా.. కంగ్రాచ్యులేషన్స్ మామ, నా 90 డిగ్రీస్ డైలాగ్ కూడా వాడారంటగా'' అంటూ పోస్ట్ లో రాసుకొచ్చింది. శ్రీరెడ్డికి వెంకీ మామ ఎలా అవుతాడనే కదా మీ సందేహం.. గతంలో ఈమె సురేష్ బాబు రెండో కొడుకు అభిరామ్ తో తనకు శారీరక సంబంధం ఉందని, వారిద్దరూ క్లోజ్ గా ఉన్న కొన్ని ఫోటోలను లీక్ చేసింది.

అభిరామ్ తో ఉన్న సంబంధం కారణంగా సురేష్ బాబుని మామ అని పిలుస్తానంటోంది. సురేష్ బాబుకి తమ్ముడైన వెంకీని ఇప్పుడు చినమామ అని వరుసలు పెట్టి పిలిచేస్తోంది. మరి ఈసారి వెంకీ ఫ్యాన్స్ శ్రీరెడ్డిపై విరుచుకుపడతారేమో చూడాలి!

PREV
click me!

Recommended Stories

Bigg Boss Telugu 10: హౌస్ నుంచి ఝాన్సీ అవుట్, అమాయకత్వంతో ఉండలేను అంటూ కన్నీళ్లు.. త్రిగుణ్ పై వర్షిణి కుట్ర
Keerthy Suresh: ఫ్లైట్‌లో కీర్తి సురేష్‌కు చేదు అనుభవం.. భర్త ఆంటోనీ ఎంట్రీతో సీన్ రివర్స్!