Naga Chaitanya: థ్యాంక్యూ షూటింగ్ మళ్ళీ మొదలెట్టేసిన నాగచైతన్య.. ఉగాదికి సర్ ప్రైజ్

Published : Jan 25, 2022, 10:46 AM IST
Naga Chaitanya: థ్యాంక్యూ షూటింగ్ మళ్ళీ మొదలెట్టేసిన నాగచైతన్య.. ఉగాదికి సర్ ప్రైజ్

సారాంశం

యూవసామ్రాట్.. అక్కినేని హీరో నాగచైతన్య(Naga Chaitanya) మంచి ఊపు మీద ఉన్నాడు. గ్యాప్ లేకుండా సినిమాలు ప్లాన్ చేసుకుంటూ.. దూసుకుపోతున్నాడు. ప్లాన్ ప్రకారం ఒక్కొసినిమాను కంప్లీట్ చేస్తున్నాడు.

యూవసామ్రాట్.. అక్కినేని హీరో నాగచైతన్య(Naga Chaitanya) మంచి ఊపు మీద ఉన్నాడు. గ్యాప్ లేకుండా సినిమాలు ప్లాన్ చేసుకుంటూ.. దూసుకుపోతున్నాడు. ప్లాన్ ప్రకారం ఒక్కొసినిమాను కంప్లీట్ చేస్తున్నాడు.

అక్కినేని హీరో నాగచైతన్య(Naga Chaitanya) కెరీర్ ను పక్కాగా ప్లాన్ చేసుకుంటున్నాడు. సినిమాల విషయంలో ఆచి తూచి అడుగులు వేస్తున్న యువ సామ్రాట్.. కమిట్ అయిన సినిమాలను ఒక్కొక్కటిగా పూర్తి చేస్తున్నాడు. లాస్ట్ ఇయర్ కరోనా పాండమింక్ టైమ్ లో కూడా లవ్ స్టోరీతో సక్సెస్ సాధించిన అక్కినేని యూవ హీరో.. ఆతరువాత వరుసగా తన సినిమాలు కంప్లీట్ చేస్తున్నాడు. విక్రమ్ కుమార్ డైరెక్షన్ లో థ్యాంక్యూ మూవీని స్టార్ట్ చేసిన నాగచైతన్య (Naga Chaitanya) ఆ తరువాత బాలీవుడ్ లో అమీర్ ఖాన్ తో లాల్ సింగ్ చద్దా మూవీ లో జాయిన్ అయ్యాడు.

ఈలోపే థ్యాంక్యూ మూవీ రెండు షెడ్యూల్స్ ను కంప్లీట్ చేసిన చైతూ(Naga Chaitanya).. విక్రమ్ కుమార్  సినిమాకు గ్యాప్ ఇచ్చి.. లాల్ సింగ్ చద్దా ను కంప్లీట్ చేశాడు. ఆతరువాత కరోనా పాండమిక్  వల్ల షూటింగ్స్ కు గ్యాప్ తీసుకున్ యువ హీరో.. వెంటనే బంగార్రాజు షూటింగ్ ను మొదలెట్టాడు. చాలా షార్ట్ టైమ్ లో బంగార్రాజు(Bangarraju) సినిమా షూటింగ్ ను కంప్లీట్ చేశారు. కళ్యాణ్ కృష్ణ డైరెక్షన్ లో తెరకెక్కిన ఈమూవీలో తన తండ్రి కింగ్ నాగార్జున (Nagarjuna) తో కలిసి స్క్రీన్  షేర్ చేసుకున్నాడు నాగచైతన్య(Naga Chaitanya).

ఇక బంగార్రాజు(Bangarraju) సినిమా రిలీజ్ అయ్యింది.. రికార్డ్ స్థాయిలో కలెక్షన్స్ కూడా సాధించింది.ఇక బంగార్రాజు సక్సెస్ జోష్ ను ఎంజయ్ చేస్తున్న నాగచైనతన్య(Naga Chaitanya).. అదే ఊపుతో థ్యాంక్యూ మూవీని కూడా కంప్లీట్ చేయాలని నిర్ణయించుకున్నాట. అందుకే మళ్ళీ వెంటనే  చైతన్య థ్యాంక్యూ(Thank You) సెట్స్ పైకి వెళ్లినట్టు తెలుస్తోంది.  సాధ్యమైనంత త్వరగా ఈ సినిమాను పూర్తిచేసే ఆలోచనలో ఉన్నారు. ఏప్రిల్ నాటికి ఈ సినిమా షూటింగు పార్టును పూర్తి చేయాలనీ, ఆ తరువాతనే ప్రమోషన్స్ ను మొదలుపెట్టాలని భావిస్తున్నారట.

బంగార్రాజు (Bangarraju)మాదిరిగానే ఈసినిమాను కూడా పరుగులు పెట్టించాలని నిర్ణాయించారట టీమ్. అందుకే ఉగాది వరకూ  ఈ సినిమా నుంచి ఫస్టు టీజర్ ను రిలీజ్ చేయాలని ప్లాన్ చేసుకుంటున్నారు. ఇక సినిమాను కూడా సమ్మర్ కానుకగా రిలీజ్ చేయాలని టార్గెట్ గా పెట్టుకున్నారు మూవీ టీమ్. తమన్ సంగీతాన్ని సమకూర్చుతున్న ఈ సినిమాలో అవికా గోర్ .. మాళవిక నాయర్ ఇద్దరూ హీరోయిన్లుగా సందడి చేయనున్నారు. ఫీల్ గుడ్ లవ్ స్టోరీతో తెరకెక్కుతున్న ఈమూవీపై పక్కా కాన్ఫిడెంట్ తో ఉన్నాడు నాగ చైతన్య(Naga Chaitanya).రు.

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Top 10 Heroines : రష్మిక కు సమంత గండం, సినిమాలు లేకున్నా మొదటి స్థానంలో ఎలా? టాప్ 10 హీరోయిన్ల లిస్ట్ ఇదే?
Malliswari Review: బావ మరదలుగా ఎన్టీఆర్, భానుమతి రొమాన్స్, ఫస్ట్ తెలుగు పాన్ వరల్డ్ మూవీగా మల్లీశ్వరి రికార్డు..