ఒకే రక్తం, ఒకే శరీరం పంచుకొని పుడితే.. 'సవ్యసాచి' టీజర్!

Published : Oct 01, 2018, 10:42 AM IST
ఒకే రక్తం, ఒకే శరీరం పంచుకొని పుడితే.. 'సవ్యసాచి' టీజర్!

సారాంశం

నాగచైతన్య, నిధి అగర్వాల్ జంటగా నటిస్తోన్న చిత్రం 'సవ్యసాచి'. చందు మొండేటి డైరెక్ట్ చేస్తోన్న ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే పూర్తయింది. ప్రస్తుతం చిత్రబృందం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాల్లో బిజీగా గడుపుతోంది. ఇప్పటికే ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ ని విడుదల చేసింది చిత్రబృందం. 

నాగచైతన్య, నిధి అగర్వాల్ జంటగా నటిస్తోన్న చిత్రం 'సవ్యసాచి'. చందు మొండేటి డైరెక్ట్ చేస్తోన్న ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే పూర్తయింది. ప్రస్తుతం చిత్రబృందం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాల్లో బిజీగా గడుపుతోంది.

ఇప్పటికే ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ ని విడుదల చేసింది చిత్రబృందం. తాజాగా సినిమా టీజర్ ని కూడా విడుదల చేసింది చిత్రబృందం. ''మాములుగా ఒక తల్లి రక్తం పంచుకొని పుడితే అన్నదమ్ములు అంటారు. అదే ఒకే రక్తం, ఒకే శరీరం పంచుకొని పుడితే దాన్ని అద్భుతం అంటారు. అలాంటి అద్బుతానికి  మొదలుని.. వరసకి కనిపించని అన్నని.. కడదాక ఉండే కవచాన్ని.. ఈ సవ్యసాచిలో సగాన్ని'' అంటూ నాగచైతన్య చెప్పే డైలాగ్ తో టీజర్ మొదలైంది.

టీజర్ చివర్లో కనిపించిన మాధవన్ లుక్ ఆకట్టుకుంటోంది. ఇక ఈ సినిమా కాన్సెప్ట్  ''వానిషింగ్ ట్విన్ సిండ్రోమ్'' అనే పాయింట్ మీద ఆధారపడి నడుస్తుందని టీజర్ ని బట్టి తెలుస్తోంది. సినిమాలో హీరో చేతులకి భార‌తంలో అర్జునుడికి ఉన్నట్లే.. రెండు చేతులకి స‌మాన‌మైన బ‌లం ఉంటుంది. అందుకే 'స‌వ్య‌సాచి' టైటిల్ పెట్టారు. నవంబర్ లో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. 

PREV
click me!

Recommended Stories

2025 Box office దగ్గర సునామీ సృష్టించిన చిన్న సినిమాలు, తక్కువ బడ్జెట్ ఎక్కువ కలెక్షన్స్
Mahesh Babu పిల్లలు కింద పడి మరీ నవ్విన వెంకటేష్ సినిమా? ఆ డైరెక్టర్ కు వెంటనే ఛాన్స్ ఇచ్చిన సూపర్ స్టార్