అక్కినేని నాగ చైతన్య త్వరలో రెండో వివాహానికి సిద్ధం అవుతున్నారు. ఇటీవల శోభిత ధూళిపాలతో నిశ్చితార్థం జరిగింది. కొంత కాలంగా రిలేషన్ లో ఉన్న వీరిద్దరూ అఫీషియల్ గా తమ బంధాన్ని అనౌన్స్ చేశారు.
అక్కినేని నాగ చైతన్య త్వరలో రెండో వివాహానికి సిద్ధం అవుతున్నారు. ఇటీవల శోభిత ధూళిపాలతో నిశ్చితార్థం జరిగింది. కొంత కాలంగా రిలేషన్ లో ఉన్న వీరిద్దరూ అఫీషియల్ గా తమ బంధాన్ని అనౌన్స్ చేశారు. నిశ్చితార్థం తర్వాత పెళ్లి ఎప్పుడు అనేది రివీల్ చేయలేదు.
చైతు, శోభిత పెళ్లి ఎప్పుడు జరుగుతుంది ? ఎక్కడ జరుగుతుంది ? లాంటి విషయాలు అభిమానుల్లో ఆసక్తిని పెంచుతున్నాయి. అయితే నిశ్చితార్థం తర్వాత నాగ చైతన్య తొలిసారి తన పెళ్లి గురించి స్పందించారు. ఓ వెడ్డింగ్ బ్రాండ్ ప్రమోషన్ కి నాగ చైతన్య హాజరయ్యారు.
ఈ సందర్భంగా చైతూకి మీడియా నుంచి ప్రశ్నలు ఎదురయ్యాయి. పెళ్లి ఎప్పడు ? ఎక్కడ చేసుకుంటారు ? సింపుల్ గానా లేక గ్రాండ్ గా ఉంటుందా అని అడిగారు. దీనితో చైతు బదులిస్తూ.. పెళ్లి అంటే నా మనసుకి నచ్చిన వాళ్లంతా ఉండాల్సిందే. భారీ స్థాయిలో గ్రాండ్ గా చేసుకోవాలని కాదు కానీ.. సాంప్రదాయం ప్రకారం అందరి సమక్షంలో పెళ్లి జరగాలి. అదే నాకు ఇష్టం అని తెలిపారు.
పెళ్లి ఎప్పుడు ఎక్కడ అనే వివరాలు త్వరలోనే చెబుతా అని చైతు తెలిపారు. ఇటీవల వివాదంగా మారిన ఎన్ కన్వెన్షన్ కూల్చివేతపై నాగ చైతన్య స్పందించలేదు. దాని గురించి ఇప్పుడు ఎందుకు అని దాటవేశారు.
సమంతతో విడాకుల తర్వాత చైతు మరోసారి తన లైఫ్ పార్ట్నర్ ని ఎంచుకున్నారు. సమంతతో విడిపోయాక చైతు ఒక ఈవెంట్ లో శోభితని తొలిసారి కలుసుకున్నారట. పరిచయం ఇలా ప్రేమగా మారింది. ఇప్పుడు వీళ్ళిద్దరూ పెళ్ళివైపు అడుగులు వేస్తున్నారు.