సమంత ఓ వివాదాస్పద మాజీ బిగ్ బాస్ కంటెస్టెంట్ కి టచ్ లో ఉంటుందట. వీరిద్దరూ ఇంస్టాగ్రామ్ లో తరచుగా చాట్ చేసుకుంటారట. ఇంతకీ ఎవరా బిగ్ బాస్ కంటెస్టెంట్ అంటే..
సమంత రూత్ ప్రభు నటిగా, బిజినెస్ ఉమన్ గా రాణిస్తుంది. ఆమెకు పలు వ్యాపారాలు ఉన్నాయి. ఈ మధ్య సినిమాలు తగ్గించింది. సెలెక్టివ్ గా చిత్రాలు చేస్తుంది. ఆమె నటించిన ఖుషి గత ఏడాది విడుదలైంది. సమంత సిల్వర్ స్క్రీన్ పై కనిపించి చాలా కాలం అవుతుంది. నవంబర్ 7న ఆమె నటించిన వెబ్ సిరీస్ హనీ బన్నీ అమెజాన్ ప్రైమ్ లో విడుదల కానుంది. హనీ బన్నీ హాలీవుడ్ సిరీస్ సిటాడెల్ కి ఇండియన్ వెర్షన్. వరుణ్ ధావన్ హీరోగా నటిస్తున్నాడు.
సమంత ఇటీవల ట్రాలాల మూవింగ్ పిక్చర్స్ పేరుతో నిర్మాణ సంస్థను ఏర్పాటు చేసింది. ఈ బ్యానర్ లో మా ఇంటి బంగారం టైటిల్ తో మూవీ ప్రకటించింది. ఈ చిత్రంలో సమంత ప్రధాన పాత్ర చేస్తుంది. సమంత సీరియస్ అండ్ ఇంటెన్స్ రోల్ ట్రై చేస్తున్నట్లు సమాచారం.
మరోవైపు సమంత పై ఎఫైర్ రూమర్స్ వినిపిస్తున్నాయి. దర్శకుడు రాజ్ నిడిమోరు తో సమంత ఎఫైర్ లో ఉన్నారని బాలీవుడ్ మీడియాలో కథనాలు వెలువడ్డాయి. దర్శక ద్వయం రాజ్ అండ్ డీకే ది ఫ్యామిలీ మ్యాన్, ది ఫ్యామిలీ మ్యాన్ 2, ఫర్జీ వంటి సక్సెస్ఫుల్ సిరీస్లు తెరకెక్కించారు. ఈ దర్శక ద్వయంలో ఒకరైన రాజ్ తో సమంత డేటింగ్ చేస్తుందంటూ వార్తలు వచ్చాయి. ఈ వార్తలపై సమంత స్పందించలేదు.
తాజాగా బిగ్ బాస్ మాజీ కంటెస్టెంట్ ఒకరు సమంత నా ఫ్రెండ్. మేము తరచుగా టచ్ లో ఉంటామని చెబుతుంది. ఆ బిగ్ బాస్ మాజీ కంటెస్టెంట్ ఎవరో కాదు ఉర్ఫీ జావేద్. ఈమె తన విలక్షణమైన డ్రెస్సింగ్ అండ్ ఫ్యాషన్ కి పెట్టింది పేరు. వింత దుస్తుల్లో పబ్లిక్ లోకి వచ్చి ఫోటోగ్రాఫర్స్ ని ఆకర్షిస్తుంది. ఉర్ఫీ జావేద్ ని ఒకటి రెండు సార్లు ముంబై పోలీసులు అరెస్ట్ చేశారు.
కాగా ఉర్ఫీ జావేద్ బయోపిక్ సిరీస్ రూపంలో అందుబాటులోకి వచ్చింది. 'ఫాలో కర్ లో యార్' పేరుతో అమెజాన్ ప్రైమ్ లో ఆగస్టు 23 నుండి స్ట్రీమ్ అవుతుంది. ఫాలో కర్ లో యార్ ప్రమోషన్స్ లో పాల్గొంటున్న ఉర్ఫీ జావేద్ హీరోయిన్ సమంత ని ఉద్దేశిస్తూ ఆసక్తికర కామెంట్స్ చేసింది. సమంత నేను ఇంస్టాగ్రామ్ ఫ్రెండ్స్. ఏదైనా నా వీడియో నచ్చితే ఆమె ఇంస్టాగ్రామ్ స్టేటస్ లో షేర్ చేస్తుంది. దీని వెనుక వేరే ఉద్దేశం ఏమీ లేదని నా నమ్మకం. సమంత నేను పలుమార్లు ఇంస్టాగ్రామ్ లో ముచ్చటించుకున్నాము.. అని ఉర్ఫీ జావేద్ చెప్పారు. ఆమె కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. కాగా 2021లో ఊట్ లో ప్రసారమైన బిగ్ బాస్ ఓటీటీ సీజన్ 1లో ఉర్ఫీ జావేద్ కంటెస్ట్ చేసింది. ఆ విధంగా ఆమె పాపులారిటీ రాబట్టింది.