పరశురామ్‌ ప్రాజెక్ట్ ని పక్కన పెట్టిన నాగచైతన్య.. కారణం ఏంటంటే?

Published : Jan 05, 2023, 03:47 PM ISTUpdated : Jan 05, 2023, 04:35 PM IST
పరశురామ్‌ ప్రాజెక్ట్ ని పక్కన పెట్టిన నాగచైతన్య.. కారణం ఏంటంటే?

సారాంశం

నాగచైతన్య అక్కినేని.. `గీత గోవిందం`, `సర్కారు వారి పాట` ఫేమ్‌ పరశురామ్‌తో సినిమా చేయాల్సి ఉన్న విషయం తెలిసిందే. కానీ దీనిపై ఓ షాకింగ్‌ రూమర్‌ వైరల్‌ అవుతుంది.

నాగచైతన్య ఇటీవల `థ్యాంక్యూ` చిత్రంతో వచ్చి నిరాశ చెందారు. థ్యాంక్స్ చెప్పడమనే కథాంశంతో మూడు లవ్‌ స్టోరీల నేపథ్యంలో రూపొందిన ఈ సినిమా ఘోర పరాజయం చెందింది. దీంతో కొత్త సినిమాల విషయంలో ఆచితూచి వ్యవహరిస్తున్నారు చైతూ. పక్కా స్క్రిప్ట్ తోనే ముందుకు వెళ్లాలని భావిస్తున్నారట. ప్రస్తుతం ఆయన వెంకట్‌ ప్రభు దర్శకత్వంలో `కస్టడీ` చిత్రంలో నటిస్తున్నాడు నాగచైతన్య. 

ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్‌, గ్లింప్స్ ఆకట్టుకున్నాయి. దీనికి విశేష స్పందన లభించింది. ఇందులో కృతి శెట్టి హీరోయిన్‌గా నటిస్తున్న విషయం తెలిసిందే. శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటోంది. ఇదిలా ఉంటే నాగచైతన్య నెక్ట్స్ `దూత` అనే వెబ్‌ సిరీస్‌లో నటిస్తున్నారు. విక్రమ్‌ కుమార్‌ దీనికి దర్శకత్వం వహిస్తున్నారు. సినిమా విషయానికి వస్తే చైతూ.. పరశురామ్‌తో సినిమా చేయాల్సి ఉంది. `నాగేశ్వరరావు` అనే టైటిల్‌తో ఈ చిత్రాన్ని తెరకెక్కించాలని భావించారు. 

`గీత గోవిందం` తర్వాత నాగచైతన్య, పరశురామ్‌ కాంబినేషన్‌ లో ఈ సినిమా తెరకెక్కించాల్సి ఉంది. కానీ మహేష్‌ ఆఫర్‌ రావడంతో చైతూ ప్రాజెక్ట్ ని పక్కన పెట్టి మహేష్‌తో `సర్కారు వారి పాట` చిత్రాన్ని రూపొందించారు పరశురామ్‌. గతేడాది విడుదలైన ఈ చిత్రం యావరేజ్‌ హిట్‌గా నిలిచింది. చాలా మంది డిస్ట్రిబ్యూటర్లు నష్టాలు చవిచూసినట్టు తెలిసింది. 

ఈ సినిమా అనంతరం మళ్లీ చైతూతో సినిమా చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు పరశురామ్‌. స్క్రిప్ట్ ఫైనల్‌ చేసే పనిలో ఉన్నారు. అయితే స్క్రిప్ట్ పరంగా నాగచైతన్య సాటిస్పై కాలేదని తెలుస్తుంది. స్క్రిప్ట్ సంతృప్తికరంగా రాకపోవడంతో ఫైనల్‌గా దీన్ని పక్కన పెట్టేశారట. దీంతో చైతూ, పరశురామ్‌ సినిమా ఉండబోదని తెలుస్తుంది. మరి ఇందులో నిజమెంతా అనేది తెలియాల్సి ఉంది. ఇదిలా ఉంటే ఇప్పుడు విజయ్‌ దేవరకొండతో ఓ సినిమా చేసేందుకు పరశురామ్‌ ప్లాన్‌ చేస్తున్నారని టాక్‌. `గీత గోవిందం` తర్వాత ఈ కాంబినేషన్‌ మరోసారి సెట్‌ కాబోతుందని అంటున్నారు. 

PREV
AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Articles on
click me!

Recommended Stories

Thanuja: కళ్యాణ్ పాడు చేసుకుంటున్నాడు, తనూజలో సడెన్ గా ఈ మార్పు దేనికోసం.. సూటిగా ప్రశ్నించిన అభిమాని
Top 6 Romantic Movies: 2025లో టాప్ 6 రొమాంటిక్ మూవీస్, ఆ ఒక్క సినిమాకి ఏకంగా 300 కోట్ల కలెక్షన్స్