ఒళ్ళు గగుర్పొడిచేలా నాగ చైతన్య తవ్వకాలు, దేనికోసం.. మైండ్ బ్లోయింగ్ వీడియో 

Published : Apr 26, 2025, 10:04 PM IST
ఒళ్ళు గగుర్పొడిచేలా నాగ చైతన్య తవ్వకాలు, దేనికోసం.. మైండ్ బ్లోయింగ్ వీడియో 

సారాంశం

తండేల్ హిట్ తర్వాత నాగచైతన్య నుంచి మరో వైవిధ్యమైన చిత్రం రాబోతోంది. ప్రస్తుతం నాగచైతన్య విరూపాక్ష ఫేమ్ కార్తీక్ దండు దర్శకత్వంలో ఒక చిత్రంలో నటిస్తున్నాడు.

తండేల్ హిట్ తర్వాత నాగచైతన్య నుంచి మరో వైవిధ్యమైన చిత్రం రాబోతోంది. ప్రస్తుతం నాగచైతన్య విరూపాక్ష ఫేమ్ కార్తీక్ దండు దర్శకత్వంలో ఒక చిత్రంలో నటిస్తున్నాడు. NC 24 అనేది ప్రస్తుతానికి వర్కింగ్ టైటిల్. శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర బ్యానర్ పై బి వి ఎస్ ఎన్ ప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.


ఈ చిత్రానికి సంబంధించిన బాక్  డ్రాప్, కాన్సెప్ట్ ని పరిచయం చేసేలా చిత్ర యూనిట్ ఓ వీడియో రిలీజ్ చేశారు.  NC 24  ఎక్స్ క్యావియేషన్ బిగిన్స్ అనే పేరుతో ఈ వీడియోని రిలీజ్ చేశారు. దీనికి తవ్వకాలు అనే మీనింగ్ వస్తుంది. ఈ చిత్రం కోసం చిత్ర యూనిట్ ఎలాంటి ప్రీ ప్రొడక్షన్ వర్క్ చేసింది, చిత్ర యూనిట్ మొత్తం కథని ఎలా అర్థం చేసుకున్నారు.. షూటింగ్ కి జరుగుతున్న సన్నాహాలు ఏంటి ఇలాంటి విషయాలని ఈ వీడియోలో మైండ్ బ్లోయింగ్ అనిపించే విధంగా చూపించారు.


వీడియో మొత్తం గుహలు, అడవులు, వివిధ మిస్టరీ ప్రాంతాలకు సంబంధించిన మినీ సెట్స్ కనిపిస్తున్నాయి. ఏదో కొత్త అంశాన్ని శోధించే విధంగా నాగచైతన్య ఈ చిత్రంలో నటించబోతున్నాడు. ఇది ఒక మైథాలజీ మిస్టరీ థ్రిల్లర్ అని చిత్ర యూనిట్ ప్రకటించింది. చూస్తుంటే ఈ చిత్రానికి భారీ బడ్జెట్ ఖర్చు అయ్యేలా ఉంది.


నాగచైతన్య శోధించేది, తవ్వకాలు జరిపేది దేనికోసం అనేది సస్పెన్స్. ఈ వీడియోతో ఒక్కసారిగా సినిమాపై రిలీజ్ కి ముందే అంచనాలు పెంచేశారు. ఈ చిత్రానికి అంజనీష్ లోకనాథ్ సంగీతం అందించబోతున్నారు. త్వరలో ఈ చిత్ర టైటిల్ కూడా ప్రకటించబోతున్నట్లు తెలుస్తోంది. ఈ మూవీలో హీరోయిన్ గా మీనాక్షి చౌదరి ఎంపికైనట్లు టాక్.

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Naga Vamsi: సంక్రాంతి సినిమాల పోటీపై నిర్మాత నాగవంశీ హాట్‌ కామెంట్‌.. `అనగనగా ఒక రాజు` ఎందుకు స్పెషల్‌ అంటే
The Raja Saab రిజల్ట్ ని ప్రభాస్‌ని ముందే ఊహించాడా? మారుతితో ఏం చెప్పాడంటే.. ది రాజా సాబ్‌ 2 అప్‌డేట్‌