'మజిలీ' కాంబినేషన్ లేనట్లే.. నాగ చైతన్య షాకింగ్ డెసిషన్

By tirumala ANFirst Published Apr 11, 2024, 7:04 AM IST
Highlights

అక్కినేని నాగ చైతన్య ప్రస్తుతం తన కెరీర్ లోనే బిగ్గెస్ట్ ప్రాజెక్ట్ లో నటిస్తున్నాడు. చందు ముండేటి దర్శకత్వంలో చైతు తండేల్ చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే.

అక్కినేని నాగ చైతన్య ప్రస్తుతం తన కెరీర్ లోనే బిగ్గెస్ట్ ప్రాజెక్ట్ లో నటిస్తున్నాడు. చందు ముండేటి దర్శకత్వంలో చైతు తండేల్ చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. గీతా ఆర్ట్స్ బ్యానర్ ఓ భారీ బడ్జెట్ లో ఈ చిత్రం తెరకెక్కుతోంది. తండేల్ తర్వాత నాగ చైతన్య విరూపాక్ష డైరెక్టర్ కార్తీక్ దర్శకత్వంలో నటించేందుకు కమిటయ్యారు. 

ఇదిలా ఉండగా మజిలీ ఫేమ్ శివ నిర్వాణ దర్శకత్వంలో చిత్రానికి కూడా చర్చ జరుగుతున్నట్లు చాలా కాలంగా ప్రచారం జరిగింది. దీనితో మజిలీ కాంబినేషన్ మళ్ళీ చూడొచ్చు అని ఫ్యాన్స్ ఆశపడ్డారు. మజిలీ చిత్రంలో చైతు, సమంత మధ్య కెమిస్ట్రీతో శివ నిర్వాణ మ్యాజిక్ క్రియేట్ చేశారు. 

శివ నిర్వాణ చివరగా తెరకెక్కించిన ఖుషి చిత్రం పర్వాలేదనిపించింది. అయితే శివ నిర్వాణ తదుపరి చిత్రం నాగ చైతన్యతో ఉండబోతోందని ఈ మేరకు శివ స్టోరీ రెడీ చేస్తున్నట్లు వార్తలు వచ్చాయి. తాజాగా సమాచారం మేరకు ఈ చిత్రం ఆగిపోయినట్లు టాక్. 

శివ చెప్పిన కథ నాగ చైతన్యకి అంతగా నచ్చలేదట. దీనితోచైతు ప్రస్తుతానికి ఈ చిత్రాన్ని పక్కన పెట్టేసినట్లు తెలుస్తోంది. మరి శివ నిర్వాణ నెక్స్ట్ స్టెప్ ఏంటి.. ఏ హీరోతో సినిమా చేస్తాడు అనే వివరాలు తెలియాలంటే కొంత కాలం ఆగాల్సిందే. 

click me!