
పరిశ్రమలో రెండు బడా కుటుంబాల వారసుడు నాగ చైతన్య(Naga Chaitanya). లెజెండరీ యాక్టర్ ఏఎన్నార్, లెజెండరీ నిర్మాత రామానాయుడుల మనవడు. లవర్ బాయ్ ఇమేజ్ తో సూపర్ డూపర్ హిట్స్ కొట్టిన చైతు.. నాగ్ తర్వాత టాలీవుడ్ లో ఆ ఫ్యామిలీ నుండి ఇమేజ్, మార్కెట్ సొంతం చేసుకున్నారు. ఏఎన్నార్ వారసులుగా పరిశ్రమకు పరిచయమైన సుమంత్, సుశాంత్ ఇంకా స్ట్రగుల్ అవుతున్నారు. వీరిద్దరూ హీరోలుగా నిలదొక్కుకోలేదు. మరో అక్కినేని వారసుడు అఖిల్.. మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్ తో ఫస్ట్ హిట్ ఖాతాలో వేసుకున్నాడు.
ఏజెంట్ మూవీతో మాస్ హీరో ఇమేజ్ కోసం ట్రై చేస్తున్నారు. చైతు మాత్రం గ్యారంటీ చిత్రాల హీరోగా ముందుకు వెళుతున్నారు. ఆయన రీసెంట్ చిత్రాలు లవ్ స్టోరీ, మజిలీ సూపర్ హిట్ కొట్టాయి. ముఖ్యంగా ఈ రెండు చిత్రాల్లో చైతు నటన అద్భుతం అని చెప్పాలి. రెండు భిన్నమైన రోల్స్ చేసిన చైతూ గొప్ప నటుడని నిరూపించుకున్నాడు. ఇక చైతూ ప్రస్తుతం విక్రమ్ కె కుమార్ దర్శకత్వంలో చేస్తున్నారు. థాంక్యూ టైటిల్ తో తెరకెక్కుతున్న ఈ మూవీపై పాజిటివ్ బజ్ నడుస్తుంది. గతంలో వీరి కాంబినేషన్ లో వచ్చిన మనం ఎంత పెద్ద హిట్టో తెలిసిందే.
ఇదిలా ఉంటే సోషల్ మీడియాలో అంత యాక్టీవ్ గా ఉండనప్పటికీ ఫ్యాన్స్ మాత్రం ఆయనను విపరీతంగా ఫాలో అవుతున్నారు. ఇంస్టాగ్రామ్ లో నాగ చైతన్య ఫాలోవర్స్ సంఖ్య 7 మిలియన్స్ కి చేరింది. 2018 లో నాగ చైతన్య ఇంస్టాగ్రామ్ అకౌంట్ ఓపెన్ చేయగా.. ఈ నాలుగేళ్లలో కనీసం 100 పోస్ట్స్ కూడా చేయలేదు. అయినప్పటికీ ఆయనను ఇంత మొత్తంలో ఫాలో కావడం ప్రాధాన్యత సంతరించుకుంది.
మరోవైపు నాగ చైతన్య డిజిటల్ ఎంట్రీకి సిద్ధమయ్యారు. ఆయన ప్రధాన పాత్రలో దూత పేరుతో ఓ వెబ్ సిరీస్ తెరకెక్కుతుంది. ఇక లాల్ సింగ్ చద్దా మూవీతో బాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్నాడు. అమీర్ ఖాన్ హీరోగా తెరకెక్కుతున్న ఈ మూవీలో చైతు ఓ కీలక రోల్ చేస్తున్నారు.