
మంజిమ ప్రముఖ సినిమాటోగ్రాఫర్ విపిన్ మోహన్ మరియు డ్యాన్సర్ కళామండలం గిరిజల కుమార్తె. ఈమె చైల్డ్ ఆర్టిస్ట్ గా కెరీర్ ప్రారంభించారు. మలయాళతమిళ చిత్రాలు చేస్తున్న మంజి మోహన్ తెలుగులో సాహసం శ్వాసగా సాగిపో చిత్రం చేశారు. ఈ మూవీ అనుకున్నంత విజయం సాధించలేదు.ఈ చిత్రానికి గౌతమ్ వాసుదేవ మీనన్ దర్శకత్వం వహించాడు.
మాంజిమ ఎన్టీఆర్ బయోపిక్‌లోనూ నారా భువనేశ్వరీ పాత్రలో నటించి ప్రేక్షకులను మెప్పించింది. కాగా, ప్రస్తుతం కోలీవుడ్ స్టార్ హీరో గౌతమ్ కార్తీక్‌తో ఆమె డేటింగ్ చేస్తోందట. దేవరట్టం అనే చిత్రంలో మాంజిమా మోహన్, గౌతమ్ కార్తీక్ జోడీగా నటించారు. ఈ సినిమా షూటింగ్ సమయంలోనే వీరికి పరిచయం అయింది. అనంతరం ఆ పరిచయం కాస్తా ప్రేమగా మారిందని సమాచారం. దీంతో ఆ ఇద్దరూ కలిసి కొన్నేళ్లుగా డేటింగ్ చేస్తున్నారని కోలీవుడ్ మీడియా తెలుపుతోంది. నిన్నటి తరం హీరో అయిన కార్తీక్ కొడుకే ఈ గౌతమ్ కార్తీక్.
మాంజిమా మోహన్, గౌతమ్ కార్తీక్ ఈ ఏడాది పెళ్లి చేసుకొబోతున్నారని పుకార్లు షికార్లు చేస్తున్నాయి. వచ్చే కొన్ని నెలల్లోనే ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది. చెన్నైలో ఇద్దరూ లివింగ్ రిలేషన్‌షిప్ కొనసాగిస్తున్నారు. దేవరట్టం చిత్రం చేస్తున్నప్పుడు ప్రేమలో పడ్డారు. ఈ ఏడాది ఒక మంచి రోజు చూసి వీరు పెళ్లి చేసుకొబోతున్నారు. వచ్చే కొద్ది నెలల్లో ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటిస్తారు అని ఈ జంటతో సన్నిహితంగా మెలిగే వ్యక్తి తెలిపారు. ఈ ఏడాది ఏప్రిల్‌లో వీరు వివాహమాడనున్నారని పుకార్లు హల్‌చల్ చేస్తున్నాయి. కానీ, ఈ విషయంపై ఎటువంటి అధికారిక సమాచారం లేదు.