Ranga Ranga Vaibhavamga: రంగ రంగ వైభవంగా... సమ్మర్ బరిలో మెగా హీరో వైష్ణవ్ తేజ్!

Published : Feb 11, 2022, 07:24 PM IST
Ranga Ranga Vaibhavamga: రంగ రంగ వైభవంగా... సమ్మర్ బరిలో మెగా హీరో వైష్ణవ్ తేజ్!

సారాంశం

వైష్ణవ్ తేజ్ లేటెస్ట్ మూవీ రంగ రంగ వైభవంగా. క్లాసిక్ టైటిల్ సినిమాపై ఆసక్తి పెంచేయగా... రొమాంటిక్ లవ్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతుంది. కాగా ఈ చిత్ర విడుదల తేదీ ప్రకటించారు చిత్ర యూనిట్.  

ఉప్పెన మూవీతో వైష్ణవ్ తేజ్(Vaishnav Tej) వంద కోట్ల వసూళ్లు రాబట్టి రికార్డు నెలకొల్పారు. డెబ్యూ మూవీతోనే వైష్ణవ్ ఈ స్థాయి కలెక్షన్స్ సాధించడంతో ట్రేడ్ వర్గాలు షాక్ తిన్నాయి. కొత్త దర్శకుడు బుచ్చిబాబు దర్శకత్వంలో వచ్చిన ఉప్పెన (Uppena) సినిమాతో అందరి దృష్టిని ఆకర్షించిన ఈ హీరో ఆ తర్వాత క్రిష్ దర్శకత్వంలో కొండపొలం (Kondapolam) మూవీ చేశారు. రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ గా నటించిన ఈ సినిమా మంచి టాక్ సంపాదించుకుంది కానీ కమర్షియల్ గా మాత్రం హిట్ కాలేకపోయింది. ఇక వైవిధ్యమైన కథలను ఎంచుకుంటున్నాడు.

ప్రస్తుతం అతను ‘రంగరంగ వైభవంగా’ (Ranga ranga vaibhavanga) అనే చిత్రంలో నటిస్తున్నాడు. ‘రొమాంటిక్‌’ తో కుర్రకారు మనసులు కొల్లగొట్టిన కేతికా శర్మ మెగా హీరోతో రొమాన్స్ చేయనుంది.కాగా ఈ చిత్రం ద్వారా అర్జున్ రెడ్డి తమిళ్ రిమేక్ అదిత్య వర్మ చిత్రాన్ని డైరెక్టర్ గిరీషాయ తెలుగు తెరకు పరిచయం కాబోతున్నారు. శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర ఎల్ఎల్ పీ బ్యానర్ పై ప్రముఖ నిర్మాత బీవీఎస్ ఎన్ ప్రసాద్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఇటీవల ఈ సినిమా నుంచి విడుదలైన రొమాంటిక్‌ టీజర్‌ అభిమానులను అలరిస్తుండగానే మరో అప్డేట్‌ ను విడుదల చేశారు దర్శక నిర్మాతలు. సమ్మర్ కానుకగా రంగరంగ వైభవంగా విడుదల చేస్తున్నారు. మే 27న ఈ చిత్రం గ్రాండ్ గా విడుదల కానుంది. ఈ మేరకు నేడు అధికారిక ప్రకటన చేశారు.

అలాగే రంగ రంగ వైభవంగా నుండి విడుదలైన ఫస్ట్‌ సింగిల్‌ ‘తెలుసా తెలుసా ఎవరికోసం ఎవరు పుడతారో .. ఎవరికి ఎవరేమి అవుతారో’ అనే ఫస్ట్ సింగిల్ సంగీత ప్రియులను అలరిస్తోంది. ప్రముఖ సంగీత దర్శకుడు శంకర్ మహదేవన్ ఆలపించగా.. శ్రీమణి సాహిత్యం అందించారు. రాక్‌స్టార్‌దేవీశ్రీ ప్రసాద్‌ బాణీలు సమకూర్చారు. కాగా కాలేజ్‌ లవ్‌స్టోరీ బ్యాక్‌డ్రాప్‌ నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కుతోందని తెలుస్తోంది.

PREV
click me!

Recommended Stories

చిరంజీవి, అనిల్ రావిపూడి రెమ్యునరేషన్స్ కే బడ్జెట్ మొత్తం అయిపోయిందా ? ఇక సినిమా పరిస్థితి ఏంటి ?
Illu Illalu Pillalu Today Episode Dec 17: వల్లిని గట్టిగా నిలదీసిన రామరాజు, దొంగ సర్టిఫికెట్లతో భాగ్యం