Naga Chaitanya: కెరీర్ లో ఫస్ట్ టైమ్ విలన్ గా నాగచైతన్య..

Published : Jan 29, 2022, 11:16 AM IST
Naga Chaitanya: కెరీర్ లో ఫస్ట్ టైమ్ విలన్ గా నాగచైతన్య..

సారాంశం

వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు అక్కినేని వారసుడు..యంగ్ హీరో నాగ చైతన్య (Naga Chaitanya). కెరీర్ లో ప్రయోగాలు కూడా చేయబోతున్నాడు. రొటీన్ సినిమాలకు స్వస్తి చెపుతున్నాడు.

వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు అక్కినేని వారసుడు..యంగ్ హీరో నాగ చైతన్య (Naga Chaitanya). కెరీర్ లో ప్రయోగాలు కూడా చేయబోతున్నాడు. రొటీన్ సినిమాలకు స్వస్తి చెపుతున్నాడు.

అక్కినేని హీరో నాగచైతన్య (Naga Chaitanya).  పక్కా ప్లాన్ తో దూసుకుపోతున్నాడు. కెరీర్ ను రొటీన్ గా కాకుండా డిఫరెంట్ గా ప్లాన్ చేసుకుంటున్నాడు. సినిమా కథలను తోందర పడకుండా  ఆలోచించి సెలెక్ట్ చేసుకుంటున్నాడు. కెరీర్ బోరింగ్ కాకుండా ఎక్స్ పెర్మెంట్ మూవీస్ ను ప్లాన్ చేసుకుంటన్నాడు చైతూ. హీరోగానే కాకుండా నెగెటివ్ క్యారెక్టర్స్ వైపు కూడా చూస్తున్నాడు.

ఇప్పటికే నాగచైతన్య(Naga Chaitanya).  లవ్ స్టోరీ, బంగార్రాజు సినిమాలతో సక్సస్ కొట్టి ఉన్నాడు.ఈ కరోనాపాండమిక్ లో కూడా మిగతా యంగ్ హీరోలకంటే ఒక అడుగు ముందే ఉన్నాడు. ప్రస్తుతం విక్రమ్ కుమార్ డైరెక్షన్ లో థ్యాంక్యూ మూవీ చేస్తున్నాడు చైతు.ఈమూవీతో  పాటు..బాలీవుడ్ లో అమీర్ ఖాన్ తో కలిసి లాల్ సింగ్ చద్దాలో నటించాడు చైతన్య(Naga Chaitanya).. ఈమూవీ ఏప్రిల్ 14న రిలీజ్ కాబోతోంది. వీటితో పాటు మరికొన్ని సినిమాలు చైతూ ఖాతాలో ఉన్నాయి.

 

మజిలీ తరువాత నాగచైతన్య సెలక్షన్ లో మార్పు వచ్చింది. ఇక ఇప్పుడు కెరీర్ లో ఎక్స్ పెర్మెంట్స్ కు పెద్ద పీటవేస్తున్న నాగచైతన్య(Naga Chaitanya) హీరోగానే కాకుండ నెగెటీవ్ రోల్స్ చేయడానికి కూడా సై అంటున్నాడు. ప్రస్తుతం అదే పనిలో కూడా ఉన్నాడు. తనతో థ్యాంక్యూ సినిమా తెరకెక్కిస్తున్న విక్రమ్ కుమార్ డైరెక్షన్ లో అమెజాన్ ప్ర్రైమ్ కోసం వెబ్ మూవీ చేస్తున్నాడు చైతూ(Naga Chaitanya).. ఈ మూవీలో చైతూ నెగెటివ్ పాత్రలో కనిపించబోతున్నారు. అంతే కాదు చైతు లుక్ కూడా కొత్తగా డిజైన్ చేశాడట విక్రమ్ కుమార్. ఆడియన్స్ కు చైతూలో కొత్త కోణాన్ని పరిచయం చేయబోతున్నట్టు తెలుస్తోందతి.

నాలుగు నెలల క్రితం స్టార్ హీరోయిన్ సమంతతో డివోర్స్ ప్రకటించాడు నాగచైతన్య (Naga Chaitanya) ఇప్పుడిప్పుడే విడాకుల హడావిడి నుంచి బయట పడుతున్నారు. ప్రస్తుతం థాంక్యూ షూటింగ్ కోసం.. టీమ్ తో కలిసి మాస్కో పర్యటనలో ఉన్నట్టు తెలుస్తోంది. అక్కడ చైతూతో కలిసి మంచు పడుతున్న టైమ్  రాశీ ఖన్నా హడావిడి చేస్తోంది.

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Bigg Boss Telugu 9: తనూజకి షాక్‌.. కళ్యాణ్‌ సీక్రెట్‌ క్రష్‌ బయటపెట్టిన ఇమ్మాన్యుయెల్‌
Dhurandhar Collections: బాక్సాఫీసు వద్ద `ధురంధర్‌` కలెక్షన్ల సునామీ.. తెలుగు ఆడియెన్స్ కి గుడ్‌ న్యూస్‌