Shruthi Haasan : ‘నాపై చూపిన ప్రేమకు ధన్యవాదాలు’.. ఎమోషనల్ అయిన శ్రుతి హాసన్

Sreeharsha Gopagani   | Asianet News
Published : Jan 29, 2022, 10:53 AM ISTUpdated : Jan 29, 2022, 10:54 AM IST
Shruthi Haasan : ‘నాపై చూపిన ప్రేమకు ధన్యవాదాలు’.. ఎమోషనల్ అయిన శ్రుతి హాసన్

సారాంశం

తన అందం, అభినయంతో టాలీవుడ్ లోనే కాకుండా ఇతర భాషల్లోనూ అభిమానులను సంపాదించుకుంది శ్రుతి హాసన్. నిన్న తన బర్త్ డే సందర్భంగా సినీ ప్రముఖులు, అభిమానులు శ్రుతికి బెస్ట్ విషేస్ తెలియజేశారు. వారి చూపిన ప్రేమకు శ్రుతి ఎమోషనల్ అయ్యింది.  

విలక్షణ నటుడు కమలహాసన్ కూతురైన శ్రుతి హాసన్ తన సినీ కేరీర్ కోసం ఎక్కడా బ్యాక్ గ్రౌండ్ ను వాడలేదు. తన స్వశక్తిని, తన టాలెంట్ నే నమ్ముకొని వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకుంటూ వెళ్లింది.

స్వయంగా తనకు గుర్తింపు తెచ్చుకోవాలని భావించిన శ్రుతి హాసన్ చిన్న సినిమాలతో తన కేరీర్ ను ప్రారంభించింది. సినిమానే లోకంగా బతికింది ఈ బ్యూటీ. సినిమా పట్ల తనకున్న ప్యాషన్ ను, తన యాక్టింగ్ సిల్స్ ను గుర్తించిన పలువురు డైరెక్టర్లు  శ్రుతికి వరుస ఆఫర్లు ఇచ్చారు. టాలీవుడ్, బాలీవుడ్, కోలీవుడ్ లోనూ తన గ్లామర్, అభినయంతో ఎంతో మంది ప్రేక్షకులను అలరించి టాప్ హీరోయిన్ గా ఎదిగింది. క్యారెక్టర్ కు ప్రాధాన్యత ఉన్న సినిమాలను చేస్తూ తన కేరీర్ లో దూసుకెళ్లోంది. 

అయితే, నిన్న శ్రుతి హాసన్ 35వ బర్త్ డే వేడుకలను జరుపుకుంది. ఈ సందర్భంగా పలువురు టాలీవుడ్ హీరోలు, డైరెక్టర్లు తనకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. తన కేరీర్ మరింత గ్రోత్ సంపాదించుకోవాలని ఆకాంక్షించారు. 

తన పుట్టిన రోజు సందర్భంగా ఇటు సినీ హీరోలు, డైరెకక్టర్లు, పలువురు ప్రముఖులు, అభిమానుల నుంచి పెద్ద ఎత్తున్న విషేస్ అందడంతో శ్రుతి ఆనందం వ్యక్తం చేస్తోంది. వారందరూ చూపే ప్రేమకు కాస్తా ఎమోషనల్ అయ్యింది.    

 

‘టైమ్ కేటాయించి నాపై ప్రేమ చూపించిన వారందరికీ ధన్యవాదాలు. ఈ ప్రేమను మాటల్లో చెప్పలేను. అందమైన, క్లిష్టమైన ఈ  భూమిపై నా జీవితంలో ఇంకో ఏడాది గడిచిపోయింది. నేను ఇంకా నేర్చుకోవాల్సింది ఉంది. జీవితంలో నాకు తారసపడే ప్రతి ఒక్కరి నుంచి ఒక కొత్త విషయాన్ని నేర్చుకోవడానికి ట్రై చేస్తుంటాను. జీవితాన్ని బ్యాలెన్స్‌ చేసుకునేలా ప్లాన్‌ చేసుకుంటుంటాను’అని పేర్కొంది.  

కాగా, ఇప్పటికే ‘క్రాక్’ మూవీతో  అలరించిన శ్రుతి హాసన్  కేజీఎఫ్  డైరెక్టర్ ప్రశాంత్ నీల్ తెరకెక్కిస్తున్న భారీ బడ్జెట్  మూవీ ‘సలార్’లోనూ ప్రభాస్ సరసన నటిస్తోంది. అదే విధంగా నందమూరి నటసింహం బాలక్రిష్ణ నటిస్తున్న ‘ఎన్ బీకే 107’లోనూ నటిస్తోంది బ్యూటీ. 
 

PREV
click me!

Recommended Stories

NTR పోలికలు ఉండటం వల్లే జూ ఎన్టీఆర్‌ని తమ ఫ్యామిలీలో కలుపుకున్నారు.. లేదంటే లెక్క వేరేలా ఉండేది
Meenakshi Chaudhary ఫస్ట్ క్రష్‌ ఎవరో తెలుసా? ప్రభాస్‌ కాదు.. వామ్మో మీనాక్షి కోరికలకు మతిపోవాల్సిందే