Naga Chaitanya: నాగచైతన్య ఎలాంటివాడంటే..? వైరల్ అవుతున్న పోస్ట్.

By Mahesh Jujjuri  |  First Published Dec 29, 2021, 9:25 AM IST

టాలీవుడ్ యంగ్ స్టార్.. అక్కినేని నటవారసుడు నాగచైతన్య(Naga Chaitanya) గురించి సోషల్ మీడియాలో ఓ పోస్ట్ వైరల్ అవుతుంది. ఆయన మంచితనం గురించి చెపుతూ.. ఓ జంట హార్ట్ టచ్చింగ్ లాంగ్ పోస్ట్ ను ఇన్ స్టాలో షేర్ చేశారు.


టాలీవుడ్ లో రెండు పెద్ద కుటుంబాల నేపథ్యం నుంచి ఇండస్ట్రీకి వచ్చాడు నాగచైతన్య (Naga Chaitanya). అక్కినేని, దగ్గుబాటి వారసుడిగా స్టార్ డమ్ పుట్టుకతోనే వచ్చినా.. చైతూ మాత్రం చాలా హంబుల్ గా ఉంటాడు. హంగులు.. ఆర్భాటాలు లేకుండా.. ఎక్కువగా మాట్లాడకుండా.. సింపుల్ గా తన లైఫ్ ను లీడ్ చేస్తుంటాడు. ఆయన మాటల్లో గొప్పలు కాని.. గర్వం కాని కనిపించదు.. వినిపించదు. ఏ బ్యాక్ గ్రౌండ్ లేని హీరోలా... డౌన్ టూ ఎర్త్ బిహేవియర్ తో.. సాఫ్ట్ గా ఉంటాడు నాగచైతన్య.

 

Latest Videos

ఈ మధ్య సమంత(Samantha)తో డివోర్స్.. తీసుకోవడం వల్ల కొంచెం డిస్ట్రబ్ అయ్యాడు చైతు. ఈ విషయంలో సోషల్ మీడియాలో కొన్ని విమర్షలు కూడా ఎదుర్కొన్నాడు. అయినా సరే స్ట్రాంగ్ గా తన పని తాను చేసుకుపోతున్నాడు యంగ్ హీరో. ఇంటా.. బయట.. ఎవరిని అడిగినా కూడా నాగచైతన్య ఎంత మంచివాడో చెపుతారు. ఇప్పుడు చైతూ మంచితనం..నిరాడంబరత మరోసారి రుజువయ్యింది. నాగచైతన్య(Naga Chaitanya) గురించి ఓ నెటిజన్  పెట్టిన లాంగ్ పోస్ట్ ప్రస్తుతం వైరల్ అవుతుంది.  

 

నవీన్ శర్మ, శిరీష అనే ఇద్దరు కపుల్ గోవాలో ఓరెస్టారెంట్ లో ఉండగా.. అక్కడ వారికి నాగచైతన్య కనిపించాడు. చైతన్య అవునా..? కాదా.? అని ఆలోచించుకుంటూ.. చైతూనే అని కన్ ఫార్మ్ చేసుకుని.. వెంటనే వెళ్లి ఆయన్ను పలకరించారు ఆ జంట. తమ అభిమాన తెలుగు నటుడు గోవాలో కనిపించడంతో.. ఎంతో సంతోషించారు. నాగచైతన్యతో చాలా సేపు మాట్లాడి, ఓ సెల్ఫీ కూడా తీసుకోబోయారు.  కాని ముగ్గురు ఫ్రేమ్ లో సరిగ్గా రాకపోవడంతో.. నాగచైతన్య చొరవ తీసకుని.. ఫోన్ తానే తీసుకుని..నేను తీస్తాను అప్పుడు మీరిద్దరు ఫ్రేమ్ లో వస్తారంటూ... స్వయంగా సెల్ఫీ తీసి ఇచ్చారు. దాంతో చైతు బిహేవియర్ కు ఫిదా అయిపోయారు ఆ కపుల్.

 

వెంటనే చైతన్య మంచితనం గురించి సెల్ఫీ తీసుకున్న నవీన్... ఇన్ స్టాలో ఓ లాంగ్ హార్ట్ టచ్చింగ్  పోస్ట్ పెట్టారు. చైతన్య మంచితనం గురించి విన్నాం.. ఇప్పుడు ప్రత్యక్షంగా చూశాం. నిజంగా చైతూ.. డౌన్ టూ ఎర్త్ అంటూ తెగ పొగిడేశారు. నాగచైతన్యతో సెల్ఫీ తీసుకోవడం జీవితంలో మర్చిపోలేని మెమోరబుల్ మూమెంట్ అంటూ ఇన్ స్టాలో పోస్ట్ చేశారు. ప్రస్తుతం ఆ పోస్ట్ వైరల్ అవుతుంది. చైతూ ఫ్యాన్స్ దిల్ ఖుష్ అవుతున్నారు. అది మన నాగచైతన్య అంటే.. అంటున్నారు.

నాగచైతన్య ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. లవ్ స్టోరీ హిట్ తరువాత జోష్ పెంచాడు చైతన్య. విక్రమ్ కుమార్ తో థాంక్యూ మూవీ షూటింగ్ దాదాపు అయిపోయింది. ఇక బంగార్రాజు లో నాన్న నాగార్జున తో కలిసి నటిస్తున్నాడు. రీసెంట్ గా ఈ మూవీ నుంచి వచ్చి సాంగ్ కు మంచి రెస్పాన్స కూడా వస్తోంది. అటు బాలీవుడ్ లో అమీర్ ఖాన్(Aamir Khan) తో కలిసి నటించిన లాల్ సింగ్ చద్దా(Laal Singh Chaddha) నెక్ట్స్ ఇయర్ రిలీజ్ కాబోతోంది. కెరీర్ లో బిజీగా ఉంటూ.. అప్పుడప్పుడు అలా రిలీఫ్ కోసం బయటకు వెళ్తున్నాడు చైతన్య. ప్రస్తుతం న్యూ ఇయర్ సెలబ్రేట్ చేసుకోవడం కోసం గోవా వేళ్ళినట్టు తెలుస్తోంది.

Also Read :Vijay Devarakonda : అల్లు అర్జున్ తరువాత విజయ్ దేవరకొండనే... రౌడీ హీరో రికార్డ్.

click me!