Naga Chaitanaya: సమంత ని టార్గెట్ చేస్తూనే చైతూ ఆ డైలాగ్‌ చెప్పాడా? .. టాలీవుడ్ లో హాట్‌ టాపిక్‌ ?

Surya Prakash   | Asianet News
Published : May 26, 2022, 11:02 AM ISTUpdated : May 26, 2022, 11:28 AM IST
Naga Chaitanaya: సమంత ని టార్గెట్ చేస్తూనే   చైతూ ఆ  డైలాగ్‌ చెప్పాడా? .. టాలీవుడ్ లో హాట్‌ టాపిక్‌ ?

సారాంశం

 వివాహ బంధం నుంచి బయటకు వచ్చిన వీరిద్దరూ ప్రస్తుతం తమ, తమ సినిమాలతో బిజీగా గడుపుతున్నారు. ఇక ఈ జంట విడాకుల తర్వాత ఇంత వరకు తారసపడలేదనే చెప్పాలి.  

నాగచైతన్య, సమంతల విడాకుల మ్యాటర్ ఏ స్దాయి చర్చకు దారి తీసిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. చక్కటి  ఈ జంట తమ వివాహ బంధానికి ఫుల్‌ స్టాప్‌ పెట్టడంతో అటు ఇండస్ట్రీతో పాటు, ఇటు వారి అభిమానులు కూడా షాక్‌ అయ్యారు. ఇక ఈ జంట విడాకులు తీసుకొని చాలా కాలం  కావస్తున్నా ఇప్పటికీ వీరి అంశం వైరల్‌గా మారుతూనే ఉంది. అసలు తమ విడాకులకు కారణమేంటన్న విషయాన్ని ఈ జంట ఇప్పటి వరకు అధికారికంగా ప్రకటించలేదు. వివాహ బంధం నుంచి బయటకు వచ్చిన వీరిద్దరూ ప్రస్తుతం తమ, తమ సినిమాలతో బిజీగా గడుపుతున్నారు. ఇక ఈ జంట విడాకుల తర్వాత ఇంత వరకు తారసపడలేదనే చెప్పాలి. వాళ్లిద్దరూ ఈ విడాకుల విషయం మర్చిపోతున్నా సోషల్ మీడియా జనం మాత్రం ఎప్పటికప్పుడు ఈ విషయాలని తవ్వుతూనే ఉన్నారు. తాజాగా ధాంక్యూ చిత్రం టీజర్ రిలీజైన సందర్బంగా ఈ విషయం మరోసారి మొదలైంది.

నాగచైతన్య హీరోగా విక్రమ్ కుమార్ దర్శకత్వంలో 'థ్యాంక్యూ' సినిమా రూపొందింది. విభిన్నమైన ప్రేమకథా చిత్రం ఇది. దిల్ రాజు నిర్మించిన ఈ సినిమా, ఇండియాలోను .. విదేశాల్లోను షూటింగును జరుపుకుంది. తమన్ సంగీతాన్ని సమకూర్చిన ఈ సినిమా నుంచి తాజాగా టీజర్ ను రిలీజ్ చేశారు. ఈ టీజర్ లో 'లైఫ్  లో కాంప్రమైజ్ అయ్యేదే లేదు .. ఎన్నో వదులుకుని ఇక్కడికి వచ్చాను' అనే డైలాగు ఉంది. దాన్ని సమంత ని ఉద్దేశించి నాగచైతన్య చెప్పినట్లుగా ప్రచారం చేస్తున్నారు. ఇందులో అక్కినేని అభిమానులుగా చెప్పుకునే వారు సైతం ఉన్నారు. అయితే ఇలాంటివి తమ హీరోకు సమస్యలు తెచ్చిపెడతాయని వారు గుర్తించాలి అంటున్నారు. 

ఇక ఈ థాంక్యూ  కథలో చైతూ జర్నీని చూపించారు. టీనేజ్ లోను .. ఆ తరువాత .. విదేశాలకి వెళ్లిన తరువాత ఆయనకు ఎదురైన అనుభవాల నేపథ్యంలో ఈ కథ నడవనున్నట్టు తెలుస్తోంది. ఒక్కో దశలో ఒక్కో హీరోయిన్ తో ఆయన ప్రయాణం కొనసాగుతుందనే విషయాన్ని చూపించారు. ఆ జాబితాలో రాశి ఖన్నా .. అవికా .. మాళవిక నాయర్ కనిపిస్తున్నారు 

'లైఫ్  లో కాంప్రమైజ్ అయ్యేదే లేదు .. ఎన్నో వదులుకుని ఇక్కడికి వచ్చాను' అనే చైతూ డైలాగ్ ను బట్టి చూస్తే, సీరియస్ గా ఆయనకి ఏదో గోల్ ఉన్నట్టుగా అర్థమవుతోంది. లవ్ .. రొమాన్స్ .. ఎమోషన్ .. యాక్షన్ కి సంబంధించిన సీన్స్ పై కట్ చేసిన టీజర్ ఆసక్తిని రేకెత్తిస్తోంది. ప్రకాశ్ రాజ్ కీలకమైన పాత్రను పోషించిన ఈ సినిమాను, జూలై 8వ తేదీన విడుదల చేయనున్నారు.

PREV
click me!

Recommended Stories

Bigg Boss Telugu 9 title Winner: నాగార్జున డైలాగ్‌తో చెప్పి మరీ కప్‌ కొట్టిన కళ్యాణ్‌, ఎమోషనల్‌ కామెంట్‌.. తనూజకే క్రెడిట్‌
Bigg Boss Telugu 9: రమ్య మోక్ష చేత అందరి ముందు క్షమాపణలు చెప్పించిన కళ్యాణ్‌.. పరువు పోయిందిగా