తన పెళ్లి తేదీ ప్రకటించేసిన నాగ చైతన్య

Published : Jun 08, 2017, 08:33 PM ISTUpdated : Mar 26, 2018, 12:02 AM IST
తన పెళ్లి తేదీ ప్రకటించేసిన నాగ చైతన్య

సారాంశం

అక్టోబర్ 6న సమంతతో తనపెళ్లి అని ప్రకటించిన నాగచైతన్య హైదరాబాద్ లోనే జరగనున్న చై-సామ్ వివాహ వేడుక పెళ్లి సంబురాల కోసం మూడు నెలలు సినిమాలకు సెలవు పెట్టనున్న జంట

తెలుగు సినీ ఇండస్ట్రీలో ప్రస్థుతం హాట్ కపుల్ ఎవరంటే నాగచైతన్య-సమంతలే. ఇప్పటికే ఎంగేజ్ మెంట్ పూర్తయిన ఈ జంట అక్టోబర్ లో పెళ్లి చేసుకోనుందని తెలిసిందే. అయితే ఏ తేదీ అనేది ఇప్పటిదాకా అఫీషియల్ గా ఎనౌన్స్ కాలేదు. కానీ... తాజాగా పెళ్లి తేదీని కూడా చైతూనే ఎనౌన్స్ చేశాడు. అక్టోబర్ 6న సమంతను పెళ్లాడబోతున్నట్టు ప్రకటించాడు నాగచైతన్య. జియో ఫిలింఫేర్ అవార్డ్స్(సౌత్) ప్రమోషన్ ప్రెస్ మీట్ లో మాట్లాడిన నాగచైతన్య.. అక్టోబర్ 6 తేదీని తమ పెళ్లి తేదీగా అఫీషియల్ గా ప్రకటించాడు.

 

నాగచైతన్య-సమంత కొన్నేళ్లుగా ప్రేమించుకుంటున్న విషయం తెలిసిందే. ఏం మాయ చేసావే చిత్రంతో తెలుగు తెరకు పరిచయమైన ఈ జంట.. ఆటోనగర్ సూర్య సినిమా టైమ్ లో ప్రేమలో పడ్డారు. మనం సినిమా టైమ్ కి ఇద్దరూ పీకల్లోతు ప్రేమలో ఉన్నారు. అప్పట్లో ఆ విషయం నాగార్జునకు తెలియదు. ప్రేమమ్ సినిమా ప్రమోషన్ టైమ్ లో  తను సమంత ప్రేమించుకుంటున్నట్టు నాగచైతన్య ప్రకటించాడు. రారండోయ్ వేడుక చూద్దాం సినిమా ప్రమోషన్ లో, అక్టోబర్ లో పెళ్లి చేసుకుంటామని తెలిపాడు. తాజాగా పెళ్లి తేదీని ఎనౌన్స్ చేశాడు.

 

పెళ్లి వేడుకల కోసం సెప్టెంబర్ మొదటి వారానికి ఫ్రీ అయిపోవాలని ఇద్దరూ డిసైడ్ అయ్యారు. ఈలోగా ఒప్పుకున్న సినిమాల్ని వీలైనంత తొందరగా పూర్తిచేయబోతున్నారు. ప్రస్తుతం సమంత చేతిలో రాజుగారి గది-2, మహానటి, రామ్ చరణ్ సినిమాలున్నాయి. వీటిలో రాజుగారి గది-2 షూట్ కంప్లీట్ అయింది. మిగతా రెండూ షూటింగ్ స్టేజ్ లో ఉన్నాయి.

 

అటు నాగచైతన్య కూడా కృష్ణ మరిముత్తు దర్శకత్వంలో చేస్తున్న సినిమాను వీలైనంత తొందరగా పూర్తిచేయాలనుకుంటున్నాడు.  చైతూ కు సంబంధించి ప్రస్తుతం సెట్స్ పై ఉన్న సినిమా ఇదొక్కటే. మరో చిత్రం కథ కూడా ఓకే అయినట్లు సమాచారం.

PREV
click me!

Recommended Stories

Remuneration: సౌత్‌లో అత్యధిక పారితోషికం తీసుకున్న ఒకే ఒక్కడు.. ఆయన ముందు ప్రభాస్, విజయ్‌, అల్లు అర్జున్‌ జుజూబీ
2025లో 8 జంటల సీక్రెట్ లవ్ ఎఫైర్స్ ..లిస్ట్ లో రాంచరణ్, ప్రభాస్, మహేష్ హీరోయిన్లు