బిగ్‌ బ్రేకింగ్‌ః నాగచైతన్య, సమంత విడాకుల ప్రకటన..

Published : Oct 02, 2021, 03:44 PM ISTUpdated : Oct 02, 2021, 03:54 PM IST
బిగ్‌ బ్రేకింగ్‌ః  నాగచైతన్య, సమంత విడాకుల ప్రకటన..

సారాంశం

 నాగచైతన్య, సమంత విడాకులు తీసుకుంటున్నట్టు గత రెండు నెలలుగా ప్రచారం జరుగుతుంది. ఇప్పటి వరకు దీనిపై మౌనంగా ఉన్న వీరిద్దరు ఎట్టకేలకు ప్రకటించారు. విడాకులు తీసుకుంటున్నట్టు నాగచైతన్య అధికారికంగా ప్రకటించారు. ట్విట్టర్‌ ద్వారా ఆయన ఈ విషయాన్ని వెల్లడించారు.

అంతా అనుకున్నదే జరిగింది. తీవ్ర ఉత్కంఠకి తెరపడింది. టాలీవుడ్‌ క్రేజీ కపుల్‌ నాగచైతన్య(naga chaitanya), సమంత(samantha) విడాకులు(divorce) తీసుకుంటున్నట్టు గత రెండు నెలలుగా ప్రచారం జరుగుతుంది. ఇప్పటి వరకు దీనిపై మౌనంగా ఉన్న వీరిద్దరు ఎట్టకేలకు ప్రకటించారు. విడాకులు తీసుకుంటున్నట్టు నాగచైతన్య అధికారికంగా ప్రకటించారు. ట్విట్టర్‌ ద్వారా ఆయన ఈ విషయాన్ని వెల్లడించారు.

`ఎవరి దారిలో వాళ్లం నడవాలనుకుంటున్నాం. ఎంతో ఆలోచించి ఈ నిర్ణయం తీసుకున్నాం. మాది పదేళ్ల స్నేహబంధం. ఈ డిఫికల్ట్ సమయంలో తమ ప్రైవసీకి భంగం కలిగించొద్ద`ని నాగచైతన్య ప్రకటించారు. ఈ మేరకు ఆయన ఎమోషనల్‌ పోస్ట్ అభిమానులతో షేర్‌ చేశారు. మున్ముందు కూడా తమకి సపోర్ట్ చేయాలని కోరారు. చైతూ ట్విట్టర్‌ ద్వారా, సమంత ఇన్‌స్టా గ్రామ్‌ ద్వారా ఈ విషయాన్ని వెల్లడించారు తమకి సపోర్ట్ ని కొనసాగించాలని అభిమానులను, శ్రేయోభిలాషులను,మీడియాని ఈ సందర్భంగా రిక్వెస్ట్ చేశారు. ప్రస్తుతం ఇది సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతుంది.

సమంత, నాగచైతన్య మొదట `ఏం మాయ చేసావె` చిత్రంతో పరిచయమయ్యారు. ఈ సమయంలోనే వీరిద్దరి మధ్య స్నేహబంధం ఏర్పడింది. అది క్రమంగా ప్రేమగా మారింది. దాదాపు ఏడేళ్ల జర్నీ తర్వాత ఇరు కుటుంబ సభ్యుల పరస్పర అంగీకారంతో పెళ్లికి సిద్ధమయ్యారు. 2017 అక్టోబర్‌ 6న వీరి వివాహం అంగరంగ వైభవంగా జరిగింది. పెళ్లికి పది కోట్లకుపైగా ఖర్చు అయినట్టు సమాచారం. టాలీవుడ్‌లో మోస్ట్ రొమాంటిక్‌ కపుల్‌గా ఉన్న వీరిద్దరు ఇప్పుడు విడిపోతున్నట్టు ప్రకటించడంతో అభిమానులు షాక్‌కి గురవుతున్నారు.

PREV
AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Articles on
click me!

Recommended Stories

Mohan Babu చిరంజీవి అన్నదమ్ములుగా నటించిన ఏకైక సినిమా ఏదో తెలుసా?
Suma Rajeev Divorce: తల్లిదండ్రుల విడాకుల విషయంలో అసలు జరిగింది ఇదే.. చెప్పేసిన సుమ కొడుకు రోషన్