
ఒకప్పుడు తెలుగులోనే కాకుండా తమిళ్ కన్నడ మలయాళం ఇంకా హిందీలో కూడా సినిమాలు చేసిన అందాల తార అక్కినేని అమల మళ్లీ చాలా రోజుల తరువాత కెమెరా ముందుకు రానుంది. మనం - లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ సినిమాలలో చివరగా కనిపించిన అమల మనం తరువాత ఇన్నాళ్లకు తన భర్త అక్కినేని సినిమాలో నటించడానికి రెడీ అయ్యారు.
మన్మథుడు సీక్వెల్ ప్రీ ప్రొడక్షన్ పనుల్లో ప్రస్తుతం నాగార్జున బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. రాహుల్ రవీంద్రన్ దర్శకత్వం వహించనున్న ఈ సినిమాలో నాగ్ సరికొత్త లుక్ తో ఆకట్టుకుంటాడని సమాచారం. అయితే సినిమాలో ఒక ప్రత్యేక పాత్ర కోసం అమలను ఎంచుకున్నారట.
ఆ పాత్ర కనిపించేది కొద్దీ సేపే అయినా అందరిని ఆకట్టుకుంటుందని టాక్. ఇది ఎంతవరకు నిజమో తెలియాలంటే మరికొన్ని రోజులు వెయిట్ చేయాల్సిందే.త్వరలోనే సినిమాకు సంబందించిన ప్రీ ప్రొడక్షన్ పనులను ముగించి సినిమా షూటింగ్ ని మొదలుపెట్టాలని నాగ్ ప్రయత్నాలు చేస్తున్నారు.